రెక్కలు విప్పిన రివల్యూషన్

 రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 1

                                 


                            రెక్కలు విప్పిన రివల్యూషన్

                                   శ్రీశ్రీ

                 

    రివల్యూషన్ ఎక్కడో పుట్టదు. సామాన్య జనం గుండెల్లోనుంచీ, వ్యధార్తుల ఆకలి కేకల్లోంఛి ఊపిరి పోసుకునేది రివల్యూషన్....విప్లవం....
    చరిత్ర గతిని, మానవ ప్రవర్తనని మార్చిన మహాఘటన 1968 పారిస్ రివల్యూషన్.
    దాన్నే మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే....
    "ఇది 1968, మే నెలలో పారిస్ లో సంభవించిన విప్లవపు కథ. విప్లవాలు చరిత్ర యొక్క సంబరాలు. సాంఘిక వాస్తవికత సాంఘిక స్వప్నంలో కలిసిపోయే క్షణం (రతి కార్యం).
    అవి ఎందుకు సంభవింఛాయనడానికి చెప్పుకొనే కారణాలెప్పుడూ అసమగ్రమే. వాటి వర్ణణలెప్పుడూ పాక్షికమే.
    మే విప్లవం కనిపించే దానికోసమూ(తిండి), కనిపించిన దానికోసమూ (ఒక నూతన వ్యవస్థ) జరిగిన పోరాటం.
    ఈ కథని ఉత్ప్రేక్షలలోనే చెప్పాలి. అగత్యం, చైతన్యం ఆచరణని తెచ్చాయి"
    ఒక్క యూరోప్ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మానవ విలువలను సమూలంగా మార్చిన ఈ రివల్యూషన్ గురించి తెలుగుదేశం గర్వించదగిన మహాకవి శ్రీశ్రీ రాసిన పుస్తకం ఇది.

                            నాంది
    
    ఇది 1968, మే నెలలో పారిస్ లో సంభవించిన విప్లవపు కథ.
    విప్లవాలు చరిత్ర యొక్క సంబరాలు. సాంఘిక వాస్తవికత, సాంఘిక స్వప్నంలో కలిసిపోయేక్షణం (రతి కార్యం).
    అవి ఎందుకు సంభవించాయనడానికి చెప్పుకొనే కారణాలెప్పుడూ అసమగ్రమే. వాటి వర్ణనలెప్పుడూ పాక్షికమే.
    మే విప్లవం కనిపించే దానికోసమూ(తిండి), కనిపించనిదాని కోసమూ (ఒక నూతన వ్యవస్థ) జరిగిన పోరాటం.
    ఈ కథని ఉత్ప్రేక్షలలోనే చెప్పాలి.
    అగత్యం, చైతన్యం ఆచరణని తెచ్చాయి.
    నూతన వ్యవస్థ మీద తీసుకున్న పోలీసు చర్య ప్రస్తుత సమాజ కళేబరాన్ని వెలిగించింది. ఇందులో పాల్గొన్న నటుల స్వప్నాలకు స్ఫటిక స్వచ్చ స్వరూపాన్నిచ్చింది.
    కనిపించేదంతా దాదాపు పూర్తిగా వెనక్కిపోయిందనవచ్చు. కనిపించనిది ప్రజల మనస్సుల్లో ఉంది. పాల్గొన్న వారి మనస్సులో.
    ఈ విప్లవానికి పూర్వం, ఇక మారదేమో అనిపించేటంత ముసలిదైన తూకాన్నిది తారుమారు చేసింది.  
    ఈనాటి అన్యాయం వల్ల ప్రోదిగొన్న చిన్నచిన్న వ్యక్తిగత భయాలకన్న, నూతన వ్యవస్థ పట్ల పెంచుకున్న సామూహికమైన ఆశలే ఎన్నోరెట్లు బలిష్టమైనవి.

                                              1

    బూర్జువా వర్గానికి ఒక సరదా వుంది,
    అన్ని సరదాలను అపకీర్తిపాలు చెయ్యడం.
    ప్లాష్ బాక్_నాన్ టెర్ ఒక సమకాలీన నీతికథ.
    1963. బుధవారం. ప్రతివారం జరిగే మంత్రివర్గ సమావేశం. ఒక యూనివర్శిటీ నివేశనం కావాలి. (అభ్యుదయం).
    వీలయితే పారిస్ చుట్టుపక్కల్లో (ప్రణాళిక)
    అప్పటిసైన్యం మంత్రి మైస్మర్, అప్పటి విద్యామంత్రి పూషేతో (మే 68లో హోంమంత్రి) "పారిస్ కి పడమరగా నాన్ టెర్ వద్ద నాకో చిన్న భూఖండం ఉంది. కావలిస్తే నువ్వు దాన్ని వాడుకోవచ్చు." (రాజకీయం)
    అది బంజర్లూ, గుడిసెల ఊళ్లూ ఉన్న ప్రాంతానికి మధ్య ఒక విమానశాఖ డిపో.
    నాన్ టెర్ లేచింది _ 1968. కాంక్రీట్ తో, గాజుతో కట్టడాలు_ 16-17 వార్డులలో నివశించేనడి మీ తరగతి కోసం. ఇంకా సంపన్న ప్రాంతాలు. పట్టణ సమాధులు. కార్లకి పార్కింగ్ స్థలాలు. లెక్కలేనన్ని, సంపన్నుల సుపుత్రుల కోసం. ఈ కుర్రాళ్ళు ఉమ్మడి కుటుంబంలోనే వుంటూ మమ్మీ (మాతృదేవత), సొంత కార్లు వాడుతూ ఉంటారు. (కుటుంబం)
    భవనాల చుట్టూ, అరబ్బులు, బుడత కీచుల దరిద్రపు గుడిసెలు.
    జీవితపు అంచులలో బక్కచిక్కిన కుర్రాళ్లు, పుట్ బాల్ ఆడుతూ (పైకి కనిపించే ఎముకలు! వాళ్ళు వాడే బూతులు!) పొగగొట్టాలు, కౌన్సిల్ భవనాలు, బంజరు భూములు. గోడల మీద పిచికారీ పిస్తోలుతో వ్రాసిన:
    నాగరికత, పరిశుభ్రత, రతిక్రీడాపరాయణత.
    12 వేల స్టూడెంట్లు, 15 వందల హాస్టళ్ళలో.
    వారానికోసారి డాన్సింగ్. రెండుసార్లు సినీ క్లబ్బు. మిగతా రాత్రులంతా టెల్లీ. (టెల్లీ అంటే టెలివిజన్)టెల్లీ ప్రజలకు నల్లమందు, మేధావుల ఆత్మహింసా సాధనం. (సంస్కృతి)
    ఒకగోడ మీద పురుగులాగ నీమొహాన్ని కిటికీగాజు తలుపుకి కొట్టుకొని కుళ్లిపో.
    చక్కని స్టెరిలైజ్ చేసిన గదులు: పెద్దగాజు కిటికీలు _ అరబ్బీ మైదానాలు కనిపిస్తూ "పరాయి" దేశీయులకు ప్రవేశం లేదు. ఫర్నిచర్ మార్చకూడదు. కొత్తవి చేర్చకూడదు. వండుకోకూడదు. యూనివర్శిటీ ఆవరణలో రాజకీయాలు నిషేధం.
    బయట గోడల మీద: ఇక్కడితో స్వేచ్చ అంతమవుతుంది.
    అమ్మాయిలు(21 ఏళ్ళు దాటితే, లేదా తల్లిదండ్రుల ప్రత్యేకానుమతి ఉంటే) అబ్బాయిల గదుల్లోకి వెళ్ళవచ్చు. కాని అబ్బాయిలు అమ్మాయిల గదుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఎంచేతంటే_ మంత్రిగారి మాటల్లో_ ప్రకృతికి తన నియమాలు తనకున్నాయి. వాటిని మరిచిపోవడం కంటే అంగీకరించడం మంచిది. అదీకాక _మంత్రి ఉవాచ_ 'బాలికలకు తమ ఆడ ప్రపంచంలో బాలురు ప్రవేశించడం నిజంగానే ఇష్టం వుండదు' (నీతులు).
    ఒక పిడికెడు మంది మావోయిస్టులూ, ట్రాట్సీయిస్టులూ, అనార్కిస్టులూ, సిట్యుయేషనిస్టులూ, ఔను, వీరితో బాటు కాన్ బాందీ. (తీవ్రవాదాలు)
    అదీ, ప్రళయానికి పూర్వం.
    సాంఘిక శాస్త్ర విద్యార్థులచే ఎక్కువ చైతన్యం. కాని మిలిటెంట్లు శూన్యంలో పనిచేస్తారు. జనాన్ని సమీకరించడానికి వాళ్లకు ఉన్నదొకే సమస్య. వియత్నాం. (ఎడమపక్షపు పుక్కిటి పురాణాలు, అధిక సంఖ్యాకులను దూరం చేసుకోవడం, కొద్దిమంది అర్థం చేసుకున్నవాళ్లు).
    నల్ల జాబితాలో కొన్ని పేర్లు. మిలిటెంట్ల పేర్లు. పిల్లల తండ్రీ, ఉదారవాదీ అయిన యూనివర్శిటీ విద్యాధికారి గ్రాపస్, అసలు నల్లజాబితా లేదు మొర్రో అంటాడు.

 

Click here for full pfd

No comments:

Post a Comment