కొండపల్లి


Kondapalli bommalu 3.jpg

కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఈ కొండపల్లి కృష్ణా జిల్లాఇబ్రహీంపట్నం మండలానికి చెందిన గ్రామము.ఈ గ్రామము విజయవాడ కు 16.5 కి.మీ. ల దూరంలో ఉన్నది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినకొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు. తేలికైన పొనికి చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి. ఈ ప్రదేశాన్ని కోండవీటి రెడ్డి రాజులు 14 వ శతాబ్ధములో పరిపాలించారు. వారు నిర్మించిన కోట ఈ గ్రామములో ఒక ఆకర్షణ. కొండపల్లి విజయవాడ గుండా పోయే జాతీయ రహదారి 221 మీద విజయవాడ కు 16 కి.మి దూరములో ఉన్నది. ఈ గ్రామానికి రైల్వే సౌకర్యం హైదరాబాదు-విజయవాడ రైల్వే లైను వల్ల కల్పించబడుతోంది.



కొండపల్లి బొమ్మలు



ఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి చేసే వీలులేదు. ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే ప్రశ్నేలేదు. మొదటిది ఎంత సమయం,ఎంత కళాదృష్టి,ఎంత ఏకాగ్రతతో చేసారో రెండవదీ అంతే సమయం,దృష్తి,ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాద్యమైన గొప్ప పనివాడితనం కొండపల్లి బొమ్మ.
కొండపల్లి బొమ్మలు తేలికైన పొనికి అనే చెక్క తో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు చిత్రి పొట్టు, చింత గింజల నుండి వచ్చిన పొడి తొ కావలసిన ఆకారములొ మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి సున్నం పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నం పై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలొ ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలొ తలపాగా పంచె కట్టుకొన్న పురుషులు, చీరలు కట్టుకొన్న స్త్రీలు కల జీవనవ్యవస్థ సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి.పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు తయారు చేస్తారు. అన్ని తీర్ధ యాత్రా స్థలాల్లోను, హస్తకళా కేంద్రాలలోను ఇవి లభిస్తాయి. ఈ కళాకారులు బొమ్మల తయారీ లొ ఉన్న శైలి, 17 వ శతాబ్ధంలొ రాజస్థాన్ రాష్ట్రములొ బొమ్మల తయారీ శైలి ఒకే విధంగా ఉండడం వల్ల ఈ కళాకారులు రాజస్థాన్ నుండి ఇక్కడకు వలస వచ్చారని భావిస్తారు.కొండపల్లిలో పూర్వం 150 వరకు కుమ్మరి కుటుంబాలు కుండలు తయారు చేసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారు
కొండపల్లి లొ పద్మసాలీలు ఎక్కువ మంది నెతపని చెసెవారు. ఇప్పుడు కొన్ని కుటుంబాలు మాత్రమె ఈ వ్రుత్తి చెస్తున్నాయి. వీరిలొ దామెర్ల ఇంటి పెరుగల వారు ఉన్న ప్రాంతం దామెర్ల వారి వీధి గా పెరు గాంచింది. వీరు నరసరావుపెట దగ్గర వున్న కుంకలగుంట గ్రామం నుండి వలస వచ్చారని తెలుస్తుంది.వీరు పూర్వీకులు దాసాంజనెయస్వామి విగ్రహాన్ని కొండపల్లి ఖిల్లా మీద నుండి తీసుకువచ్చి దామెర్ల వారి వీధి లొ ప్రతిస్టించినారు.దీనిని మరల దామెర్ల సత్యనారాయణ పున:ప్రతిస్టచెసారు.

కొండపల్లి కోట

కొండపల్లి కోటను కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి 14 వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడి విరూపాక్ష దేవాలయ సమీపంలో చక్కని పిక్నిక్‌ ప్రదేశం కలదు.

No comments:

Post a Comment