Showing posts with label telugu navels. Show all posts
Showing posts with label telugu navels. Show all posts

అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర

శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మవృత్తాంతము  క్లుప్తముగా అందరికి అర్థమయ్యే విధంగా సూక్ష్మ కథతో వ్రాయడము జరిగింది.



అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగారమును, మంధర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మధించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలహలమును గాంచి భయబ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా, అది చూసిన పరమేశ్వరుడు హాలహలమును మ్రింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బందించి గరళకంఠుడై వెడలెను. అందులకు సంతోషించిన దేవదానమవులు మరల క్షీరసాగారమును మధించగా అమృతభాండము లభించినది, ఆ అమృతమును గూర్చి దేవదానవులు వాదులాడు కొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా, జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోకసౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయా మోహంబున బంధించి అమృత భాండమును దేవతల కందించి వెడలుచుండగా, ఆ అతిలోకసుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయలీలలను గ్రహించిన వాడై మోహము నొందెను.


మోహిని గాఢoగా వయ్యారము ఒలకబోసి పరమేశ్వరుని గాంచి అధమరిచి కవ్వించెను. అంత ఆ హరిహరుల గాఢపరిష్వంగంలో జాలువారిన శ్వేత బిందువుల కలయిక వలన నల్లని శరీరఛాయతో ఉగ్రరూపధారియై ఉద్భవించిన కుమారుడు జన్మించెను. అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడను నామకరణము చేసెను.తల్లి అయిన మోహిని (శ్రీహరి) తన కంఠమందున్ను మనిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని, తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాధుడని పిలిచారు. శివకేశవుల తత్వమున ఉత్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచూ ధర్మశాస్తాగా ఖ్యాతి గడించెను.


అలా అండగా మహిషాసురిని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి. ఆ తల్లి ఆశిర్వాదముతో శ్రీలక్ష్మీ, సరస్వతి, పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను. తన సోదరుని మరణవార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుటకై ముల్లోకములను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా, మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను. అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా, అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కుడా సాధ్యపడదని మీరే సెలవిస్తిరి కాన వారిద్దరికి జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించునట్లుగా వరమడిగెను.అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను. అంత ఆ మహిషి హరిహరులకు సంగమముతో బాలుడు జన్మించునా! జన్మించినను భూలోకమందు ఎలా జన్మించును! అది ఎలా సాధ్యమగును? అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు? అయినా నేను ఈ లోకముము వదిలి నేనెలా భూలోకమునకు వెల్లుదుననే అజ్ఞాతముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగెను. మహిషి పెట్టె బాధలు భరించలేని దేవతలు, దేవేంద్రునీతో కలిసి పరమశివుని వద్దకు వెళ్లి వారి బాధలను చెప్పుకొనిరి. వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాధునికి ఆజ్ఞాపించెను. తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాధుడు సమ్మతించెను. ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మధ బాణాలను వదిలి మహిషిని మొహపరవశము చేశాడు, అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా  మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని లోబరచి భూలోకమందున్న అలుదానది తీరమునకు తీసుకొని పోయి కామకేళి విలాసముతో మైమరపించుచుండెను.


కేరళదేశము నందు పందళ రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు, అతడు పరమ శివభక్తుడు, ఆయన భార్యా సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు, అయినా వారికి చాలాకాలము వరకు సంతానము కలుగలేదు. అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు, వ్రతములు, పూజలను జరిపించిన సంతానము కలుగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రము మానలేదు. ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానదీ తీర అడవి ప్రాంతములోని క్రూరమృగముల బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకొని వేటకు వెళ్ళాడు, అంతలో పంబానదీ


ఆ మణికంఠుడు అడుగు పెట్టిన మహత్యమో ఏమో కాని మొత్తానికి పందల రాజ్యము సుభీక్షముగా నుండెను. అంతనే కాక పందళరాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారున్ని ప్రసవించెను. వారి ఆనందములకు అవధులు లేకుండెను. మణికంఠునికి అయిదవ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునకు పంపిరి. అక్కడ మణికంఠుడు అనతికాలములోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్రపారంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను.ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న వావరు అను బందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకొనెను.

మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్టించునేమో అనుకొని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నెను. ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనము అధిష్టించి యువరాజుగా పాలించే అర్హత లేదు యను నెపంతో రాణిగారికి దుర్భోద చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించెను. కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా, పరమేశ్వరుడు అడ్డుకుని మణికంఠుని కాపాడేవాడు. అంతటితో చాలక మహామంత్రి విష ఆహారమును పెట్టించెను. దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు. మణికంఠుని వదిలించుకొనుటకు ఏ కుతంత్రములు ఫలించుటలేదని నిరాశ నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలయినది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వ్యాధి నయమగును అని సెలవిచ్చేరు.


ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవ్వరు యని మహారాజు చింతాక్రాంతుడైనాడు. పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల ఋణమును తీర్చుటకై మణికంఠుడు అనుజ్ఞ అడుగగా మహారాజు కృంగిపోయాడు. పట్టువదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడగగా మహారాజు అనుజ్ఞ ఇవ్వక తప్పలేదు. పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందళరాజు ఎత్తిన ఇరుముడిని తలపైదాల్చి చేతిలో విల్లమ్ములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపెను. మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి, సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు. అందుకు స్వామి వారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి అలుదానదీ తీరమువైపు పయనమైనాడు. అచట దత్తాత్రేయుడు మగమహిష రూపము చాలించి దేవలోకమునకు వెళ్ళెను. తన చెలికాడు ఎచటకు వెళ్ళాడో తెలియని మహిషి రంకెలు వేయుచు వెదుకుచుండెను. ఆ సమయమున నారదమహర్షి మహిషికి ఎదురై నిను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయెను. ఆ మాట వినగానే మహాఉగ్రురాలై మహిషి కరుడు గట్టిన రాక్షతత్వంతో జూలు విదిలించి స్వామిని మానవ మాత్రుడుగా తలచి ఎదుర్కొనెను. వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది. మణికంఠుడు తన రెండుచేతులతో మహిషిని లేవనెత్తి గిరగిర త్రిప్పుతూ అలుదానది తీరమున పడవేసెను.

అంతట మహిషిలో నుండి శాపవిమోచము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామి వారిని వివాహము చేసుకోమని ప్రార్థించెను. అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్యబ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉండెదను, కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికం

ఠుడు చెప్పగా, అపుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీ కోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామీ! అని అడుగగా, మణికంఠుడు ఆమె వద్దకు పోయి దేవీ నీవు కుడా నా ప్రక్కనే మాళిగాపురోత్తమ్మగా వెలుగొంది నాతోపాటు నీవు కుడా పూజలను అందుకొని నా దీక్షబూని వచ్చిన స్వాములను భాదించక కాపాడి ఉండమని సెలవిచ్చెను. అపుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడుగగా, దేవీ! మొదటిసారి మాలధరించి కన్నెస్వామిగా 41 రోజుల దీక్షబూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనము వివాహము చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు. 

మహిషి సంహారము జరిగినందుకు ఆనందముతో దేవతలు యుండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి, స్వామి! మీరు మీ తల్లి గారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తుచేసి , ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకొని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పంద  రాజ్యం చేరుతారు. అంతా ప్రజలు అందరూ భయభ్రాంతులై ఉండగా,

 

పందళ రాజు ఎదురువచ్చి ఆనందముతో మణికంఠుని కౌగిలించుకొని, నాయన మణికంఠ నీవు సామాన్యుడవు కాదు దైవాంస సంభూతుడివి, మా తప్పులు మన్నించి, మహారాణి, మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించెను. మణికంఠుడు అంగీకరింపక నాకవసరము లేదు. ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజనుండుకి ఇవ్వండి. నా అవతారము పరిసమాప్తి అవుతుంది. మీ అనుమతి కొరకు వచ్చితిననగా, మహారాజు, మహారాణి, మరియు ప్రజలంతా శోక సముద్రములో మునిగిపోయారు. అంతట 

పందళరాజు అయ్యా నీ పట్టాభిషేకము కోసము చేసిన ఆభరణములైన స్వీకరించమనగా, మహారాణి అప్పా మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా, వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభీష్టము మన్నించి, తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా + అప్పా అని పిలిచి కన్నకొడుకుగా చుసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ, నేను ఒక బాణము సంధిస్తాను అది ఏ స్థలములో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి. ఆ ఆలయమునకు ముందు పద్దెనిమిది సిద్ధులకు సాంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతీ మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను. ఆ సమయమున మీరు నా కోసమై చేయించిన ఆభరణములు నియమ నిష్టాగరిష్టులై తీసుకొని వచ్చి పడునెట్టాంబడిని  దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య ప్రదాతనై వారికి జీవస్ముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు.


స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన శబరితల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర పదునెనిమిది మెట్లతో పందళరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ప్రతీ మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి.

రెక్కలు విప్పిన రివల్యూషన్

 రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 1

                                 


                            రెక్కలు విప్పిన రివల్యూషన్

                                   శ్రీశ్రీ

                 

    రివల్యూషన్ ఎక్కడో పుట్టదు. సామాన్య జనం గుండెల్లోనుంచీ, వ్యధార్తుల ఆకలి కేకల్లోంఛి ఊపిరి పోసుకునేది రివల్యూషన్....విప్లవం....
    చరిత్ర గతిని, మానవ ప్రవర్తనని మార్చిన మహాఘటన 1968 పారిస్ రివల్యూషన్.
    దాన్నే మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే....
    "ఇది 1968, మే నెలలో పారిస్ లో సంభవించిన విప్లవపు కథ. విప్లవాలు చరిత్ర యొక్క సంబరాలు. సాంఘిక వాస్తవికత సాంఘిక స్వప్నంలో కలిసిపోయే క్షణం (రతి కార్యం).
    అవి ఎందుకు సంభవింఛాయనడానికి చెప్పుకొనే కారణాలెప్పుడూ అసమగ్రమే. వాటి వర్ణణలెప్పుడూ పాక్షికమే.
    మే విప్లవం కనిపించే దానికోసమూ(తిండి), కనిపించిన దానికోసమూ (ఒక నూతన వ్యవస్థ) జరిగిన పోరాటం.
    ఈ కథని ఉత్ప్రేక్షలలోనే చెప్పాలి. అగత్యం, చైతన్యం ఆచరణని తెచ్చాయి"
    ఒక్క యూరోప్ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మానవ విలువలను సమూలంగా మార్చిన ఈ రివల్యూషన్ గురించి తెలుగుదేశం గర్వించదగిన మహాకవి శ్రీశ్రీ రాసిన పుస్తకం ఇది.

                            నాంది
    
    ఇది 1968, మే నెలలో పారిస్ లో సంభవించిన విప్లవపు కథ.
    విప్లవాలు చరిత్ర యొక్క సంబరాలు. సాంఘిక వాస్తవికత, సాంఘిక స్వప్నంలో కలిసిపోయేక్షణం (రతి కార్యం).
    అవి ఎందుకు సంభవించాయనడానికి చెప్పుకొనే కారణాలెప్పుడూ అసమగ్రమే. వాటి వర్ణనలెప్పుడూ పాక్షికమే.
    మే విప్లవం కనిపించే దానికోసమూ(తిండి), కనిపించనిదాని కోసమూ (ఒక నూతన వ్యవస్థ) జరిగిన పోరాటం.
    ఈ కథని ఉత్ప్రేక్షలలోనే చెప్పాలి.
    అగత్యం, చైతన్యం ఆచరణని తెచ్చాయి.
    నూతన వ్యవస్థ మీద తీసుకున్న పోలీసు చర్య ప్రస్తుత సమాజ కళేబరాన్ని వెలిగించింది. ఇందులో పాల్గొన్న నటుల స్వప్నాలకు స్ఫటిక స్వచ్చ స్వరూపాన్నిచ్చింది.
    కనిపించేదంతా దాదాపు పూర్తిగా వెనక్కిపోయిందనవచ్చు. కనిపించనిది ప్రజల మనస్సుల్లో ఉంది. పాల్గొన్న వారి మనస్సులో.
    ఈ విప్లవానికి పూర్వం, ఇక మారదేమో అనిపించేటంత ముసలిదైన తూకాన్నిది తారుమారు చేసింది.  
    ఈనాటి అన్యాయం వల్ల ప్రోదిగొన్న చిన్నచిన్న వ్యక్తిగత భయాలకన్న, నూతన వ్యవస్థ పట్ల పెంచుకున్న సామూహికమైన ఆశలే ఎన్నోరెట్లు బలిష్టమైనవి.

                                              1

    బూర్జువా వర్గానికి ఒక సరదా వుంది,
    అన్ని సరదాలను అపకీర్తిపాలు చెయ్యడం.
    ప్లాష్ బాక్_నాన్ టెర్ ఒక సమకాలీన నీతికథ.
    1963. బుధవారం. ప్రతివారం జరిగే మంత్రివర్గ సమావేశం. ఒక యూనివర్శిటీ నివేశనం కావాలి. (అభ్యుదయం).
    వీలయితే పారిస్ చుట్టుపక్కల్లో (ప్రణాళిక)
    అప్పటిసైన్యం మంత్రి మైస్మర్, అప్పటి విద్యామంత్రి పూషేతో (మే 68లో హోంమంత్రి) "పారిస్ కి పడమరగా నాన్ టెర్ వద్ద నాకో చిన్న భూఖండం ఉంది. కావలిస్తే నువ్వు దాన్ని వాడుకోవచ్చు." (రాజకీయం)
    అది బంజర్లూ, గుడిసెల ఊళ్లూ ఉన్న ప్రాంతానికి మధ్య ఒక విమానశాఖ డిపో.
    నాన్ టెర్ లేచింది _ 1968. కాంక్రీట్ తో, గాజుతో కట్టడాలు_ 16-17 వార్డులలో నివశించేనడి మీ తరగతి కోసం. ఇంకా సంపన్న ప్రాంతాలు. పట్టణ సమాధులు. కార్లకి పార్కింగ్ స్థలాలు. లెక్కలేనన్ని, సంపన్నుల సుపుత్రుల కోసం. ఈ కుర్రాళ్ళు ఉమ్మడి కుటుంబంలోనే వుంటూ మమ్మీ (మాతృదేవత), సొంత కార్లు వాడుతూ ఉంటారు. (కుటుంబం)
    భవనాల చుట్టూ, అరబ్బులు, బుడత కీచుల దరిద్రపు గుడిసెలు.
    జీవితపు అంచులలో బక్కచిక్కిన కుర్రాళ్లు, పుట్ బాల్ ఆడుతూ (పైకి కనిపించే ఎముకలు! వాళ్ళు వాడే బూతులు!) పొగగొట్టాలు, కౌన్సిల్ భవనాలు, బంజరు భూములు. గోడల మీద పిచికారీ పిస్తోలుతో వ్రాసిన:
    నాగరికత, పరిశుభ్రత, రతిక్రీడాపరాయణత.
    12 వేల స్టూడెంట్లు, 15 వందల హాస్టళ్ళలో.
    వారానికోసారి డాన్సింగ్. రెండుసార్లు సినీ క్లబ్బు. మిగతా రాత్రులంతా టెల్లీ. (టెల్లీ అంటే టెలివిజన్)టెల్లీ ప్రజలకు నల్లమందు, మేధావుల ఆత్మహింసా సాధనం. (సంస్కృతి)
    ఒకగోడ మీద పురుగులాగ నీమొహాన్ని కిటికీగాజు తలుపుకి కొట్టుకొని కుళ్లిపో.
    చక్కని స్టెరిలైజ్ చేసిన గదులు: పెద్దగాజు కిటికీలు _ అరబ్బీ మైదానాలు కనిపిస్తూ "పరాయి" దేశీయులకు ప్రవేశం లేదు. ఫర్నిచర్ మార్చకూడదు. కొత్తవి చేర్చకూడదు. వండుకోకూడదు. యూనివర్శిటీ ఆవరణలో రాజకీయాలు నిషేధం.
    బయట గోడల మీద: ఇక్కడితో స్వేచ్చ అంతమవుతుంది.
    అమ్మాయిలు(21 ఏళ్ళు దాటితే, లేదా తల్లిదండ్రుల ప్రత్యేకానుమతి ఉంటే) అబ్బాయిల గదుల్లోకి వెళ్ళవచ్చు. కాని అబ్బాయిలు అమ్మాయిల గదుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఎంచేతంటే_ మంత్రిగారి మాటల్లో_ ప్రకృతికి తన నియమాలు తనకున్నాయి. వాటిని మరిచిపోవడం కంటే అంగీకరించడం మంచిది. అదీకాక _మంత్రి ఉవాచ_ 'బాలికలకు తమ ఆడ ప్రపంచంలో బాలురు ప్రవేశించడం నిజంగానే ఇష్టం వుండదు' (నీతులు).
    ఒక పిడికెడు మంది మావోయిస్టులూ, ట్రాట్సీయిస్టులూ, అనార్కిస్టులూ, సిట్యుయేషనిస్టులూ, ఔను, వీరితో బాటు కాన్ బాందీ. (తీవ్రవాదాలు)
    అదీ, ప్రళయానికి పూర్వం.
    సాంఘిక శాస్త్ర విద్యార్థులచే ఎక్కువ చైతన్యం. కాని మిలిటెంట్లు శూన్యంలో పనిచేస్తారు. జనాన్ని సమీకరించడానికి వాళ్లకు ఉన్నదొకే సమస్య. వియత్నాం. (ఎడమపక్షపు పుక్కిటి పురాణాలు, అధిక సంఖ్యాకులను దూరం చేసుకోవడం, కొద్దిమంది అర్థం చేసుకున్నవాళ్లు).
    నల్ల జాబితాలో కొన్ని పేర్లు. మిలిటెంట్ల పేర్లు. పిల్లల తండ్రీ, ఉదారవాదీ అయిన యూనివర్శిటీ విద్యాధికారి గ్రాపస్, అసలు నల్లజాబితా లేదు మొర్రో అంటాడు.

 

Click here for full pfd

తల్లి మనసు కధలు పేజి

  తల్లి మనసు కధలు పేజి 1

                                 


                                        తల్లి మనసు
                                                                               డి. కామేశ్వరి

 

                                        

   
    పావుతక్కువ తొమ్మిదయింది . కమల గబగబ జడ అల్లుకుని, ముఖానికి యింత పౌడరద్దుకుని వంటింట్లోకి వెళ్ళింది.
    పొయ్యి మీద యింకా ఏదో వుడుకుతూనే వుంది. అత్తగారికింకా గిన్నెలతో కుస్తీ పడుతుంది. వంటకాలేదన్న మాట! తెలిసినా అడిగింది కమల "వంటయిందాండి.... తొందరగా ఆఫీసు కెళ్ళాలి యివాళ ...."
    "ఆ! ఆ ! అవుతుంది. చూస్తున్నావుగా నేనేం కూర్చున్నాన్నా! అక్కడికీ రోజుకంటే అరగంట ముందే మడికట్టు కున్నాను. ఉడకాలా వాటితో పాఫు నేనూ వుడుకుతానా? ఇదిగో యీ పప్పుదింపి ఆ పులుసు పోపు కూరపోపు వేసి పెడ్తాను.... దిక్కుమాలిన కర్రలు మండి చస్తేనా? ఊదిఊది నోరు పడిపోతుంది కళ్ళు పోతున్నాయి...." సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది.
    ఈ భాగోతం రోజూ వినేదే కనుక కమల ఆ మాటలు వినకుండా పీటవాల్చుకుని కంచం పెట్టుకుని, మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. "ఎంతవరకయితే అదే పెట్టేయండి. తొమ్మిదిన్నరకి అక్కడుండాలి నేను. ఇన్ స్పెక్టన్ వుంది. "ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని; అయినా ఆవిడకేం లెక్క! వుండవే అలా కాళ్ళ క్రింద నిప్పులు పోసేస్తే ఎలా చస్తాను ----" అంటూనే పప్పులో యింక ఉప్పు వేసి కుమ్మి అదే యింక కంచంలో పడేసింది. తీర్దానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఒగిన్నేలో పోసింది. ఉమ్మగిల్లని అన్నం యింత పడేసింది కంచంలో . "కూర అవనీయవు.... ఏం ఉద్యోగాలో నీవే చేస్తున్నట్టున్నావు..... నిన్నటి చింతకాయ పచ్చడి వేయనా ...." అదో యింత ముద్ద పడేసింది సుబ్బమ్మ.
    కమల దేనికి జవాబియ్యకుండా ఊదుకుంటూ యింత పప్పు అన్నం కలుపుకుని తిని మజ్జిగ వేసేసుకుంది.
    "అయ్యో రాత! ఏమిటే ఆ తిండి " సుబ్బమ్మ నోరు వాగుతూనే వుంది. కమలకిదేం క్రొత్తగాదు యీ యింట్లో ఏనాడో చెవులు, నోరు మూసుకోవడం అలవాటయింది కమలకి.
    ఇదేం క్రోత్తా! రోజూ ఆఫీసు వేళకి యింత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు, అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది . మజ్జిగ త్రిప్పుతుంది. గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమిరిస్తే ఆ వంట కాస్తా వండటానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది. ఆవిడ మడికి పనికిరాదని వూరుకోడం గాని యీ మాత్రం వంట అరగంటలో వండి, తిని, ఆఫీసు కెళ్ళగలదు తను. రోజూ యిలాంటి భోజనం అలవాటే, ఉడికీ ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగీ కాగాని పులుసుతో ఏదో యింత నోట్లో పడేసుకుని అదర బాదరా అఫీసుకి పరిగెత్తడం తనకి ఆయనకీ అలవాటే రోజూ ! ఈతిండితో సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూరకాడల్లా వాడిపోవడమూ అలవాటే. మధ్యలో అక్కడ త్రాగేది కప్పు కాఫీ!
    "వాడెడి ? వాడు రాకుండానే తినేసి పోతావుటే....?"
    కమల జవాబు చెప్పకుండా కంచం ఎత్తి మూలపడేసి చేయి కడుక్కుంది.
    ఆయనగారు తిన్నాక అవిస్తట్లోనే తినాలి. పతివ్రతా ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీసుకి వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం తోచదు కాబోలు! మొగుడంటే భక్తీ గౌరవం లేనట్టు లెక్క గాబోలు ముందు తింటే !
    ఆఫీసులో ఇనస్పెక్షన్ వుంది. తొమ్మిదిన్నరకి అక్కడ ఉండాలి. రెండు బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే తొమ్మిదయింది ... ఆయనగారు వచ్చి అయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది ?
    కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల. గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకుని బేగు రుమాలు తీసుకుని గబగబ వెళ్ళింది వీధిలోకి.
    గుమ్మంలోనే ఎదురు పడ్డాడు సుబ్బారావు . సైకిలికి ఎడాపెడా సంచులు తగిలించుకుని "అప్పుడే ఎక్కడికి బయలు దేరావు?" భార్యని చూసి అడిగాడు.
    "ఆఫీసుకి."
    "తొమ్మిదే అయింది ఎందుకా తొందర భోం చేసి వస్తాను, వుండు వెడదాం.'
    "నాకు పనుంది. తొందరగా వెళ్ళాలి. మీరు తర్వాత వెళ్ళండి. ' తప్పించుకొని మెట్లు డిగింది కమల.
    "ఏమిటో ఆ అర్జంటు పని ! ముందెళ్ళి అందరితో బాతాఖానీ కొట్టాలా వెళ్ళు ..... వెళ్ళు.... అక్కడే కబుర్లు నీకోసం చూస్తుంటాయి."
    "ఏదీ పోనీ పాపం బస్సులు అవి వంటరిగా మారలేదని" కమలకు వళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడి వైపు. 'అవును బాతాఖానీ కొట్టడానికే వెడుతున్నాను. దారి వదలండి' రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబీయటం ఇష్టం లేక మొహం త్రిప్పుకుని వడివడిగా వెళ్ళింది కమల. సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు.
    బాతాఖానీ కొట్టడానికి వేడుతూందిట..... 'అందుకోసం గంటముందు తిండన్న తినకుండా ఆదరాబాదరా బయలుదేరింది ! హ ఏం మగాళ్ళు! ఓ పావుగంట ముందు వెడితే ఎందుకోనని అనుమానం! ఆఫీసులో మొగాళ్ళతో పెళ్ళాం ఖాతాఖానీ కొడుతుందేమోననే మొగాళ్ళు  భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశ పెట్టడం! భార్య తెచ్చే డబ్బు కావాలి! కాని ....ఆభార్య తోటి ఉద్యోగాస్తునితో నన్నా ఓ మాట మాట్లాడకూడదు నవ్వకూడదు. తలవంచుకొని ఆఫీసుకెళ్ళి ఇంటికి రావాలి. ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకుని పైకి పెద్ద ఆదర్శ వాదుల్లా అభ్యుదయ భావాలు గల వారిలా భార్యని ఉద్యోగం చేయిస్తున్నట్టు ఫోజు....! .... హ బస్సులు ఎక్కలేదట! ఏ బస్సులు ఎక్కకుండానే రెండేళ్ళ బట్టి ఉద్యోగం చేస్తుంది గాబోలు! ఎంత చులకన ..... పెళ్ళాం అంటే ..

 

Full PDF  Click Here