Showing posts with label విశ్వనాథ సత్యనారాయణ. Show all posts
Showing posts with label విశ్వనాథ సత్యనారాయణ. Show all posts

విశ్వనాథ సత్యనారాయణ

 

విశ్వనాథ సత్యనారాయణ

 విశ్వనాథ వారిది విశిష్టమైన శైలి. అతను రచనల్లో లోకానుభవం తొంగి చూస్తుంది. అతను గురించి అతనుే చెప్పుకున్న ఈ వాక్యాలు అతను శైలిని అవగతం చేస్తాయి:
నాకవిత్వం అంతా నా జీవితంలోని అనుభవాలమయం. లోకవ్యక్తిని కావ్యవ్యక్తి నయ్యాను. దశరథుణ్ణి గూర్చి బంధుజ్యేష్ఠుడన్నాను, వేయిపడగలలో "రామేశ్వరశాస్త్రి బంధుజ్యేష్ఠుడు" అన్నాను. ఎవరీ బంధుజ్యేష్ఠుడు? మా నాయనగారు. నీ చుట్టువున్న లోకంలో నీకు చెందని భావం ఏముంటుంది? ఈ భావాలు. ఈ అనుభవాలు నీ మనస్సుపై వేసిన ముద్రలలో నుండే నీ మాటలు దొర్లుకొనివస్తాయి. నీవు కవివయితే ఆ శబ్దము వ్యంజకమై కావ్యత్వాన్ని పొందుతుంది. కవివయితే నంటే ఏమిటి? కవియైనవాడు లోకాన్ని చూచే దృష్టివేరు వానికి కనిపించే లోకము అందరు చూచే లోకమే

పలుచని బురదలోపల మానిసిని జూచి
         నెగచి యూకున దూకె నీటిపాము
వెలివడ్డ బొరియముంగలనిక్కి తెల్లబో
         యెను కొంగ కెఱగాని యెండ్రకాయ
ఒడ్డున బురదలో గొడ్డు గిట్టలు దిగి
         పడె జంఘదఘ్నమై పంటకాల్వ
జనుము చల్లుటకు తీసిన పాయ పాపట
         చక్కదీగిచి దిద్దె సస్యలక్ష్మి
    పలుచగా వేడియెక్కు బవళ్ళతోడ
    బైరగాలి పొరల్ తడియారజొచ్చె
    పగటి కుషసు నా నొప్పె నవార్షుకములు
    కాఱులకు దొల్తగా శరత్కాల లక్ష్మి

తెలుగు ఋతువులలో ఈ పద్యం వ్రాసాను. నేను మా పల్లెలో చిన్ననాడు చూచిన దృశ్యాలు ఎవరూచూడలేదా? చూసేవుంటారు కాని చెప్పలేదు. శక్తి లేక చెప్పకపోవచ్చు లేక ఆ దృష్టి లేకచెప్పకపోవచ్చు. కనుక ఎవడు కవి? ఆ శక్తి, ఆ దృష్టి ఉన్నవాడు.