కొండవీడు కోట


కొండవీడు కోట

కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. సరాసరి కొండమీదకు వెళ్లేవారి కోసం నిర్మించాల్సిన ఘాట్‌రోడ్డుకు సర్వే పూర్తి కావస్తోంది. కొండమీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి.కొండమీద ఉపయోగించుకునే అవకాశం ఉన్న భూమి విస్తీర్ణం అయిదు చదరపు కిలోమీటర్లు.కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది.ఘాట్‌రోడ్డు కొత్తపాలెం వైపు నుంచి, అయిదో నెంబరు జాతీయ రహదారికి సమీపంలో గల కోట, కొండవీడు గ్రామాల వైపు నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తూ మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది.కొండవీడు కోటను పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా జి.ఒ.1535 తేదీ 2-11-1966న నిర్ణయించారు. ఇక్కడో కందకం(అగడ్త)ఉండేది. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈకందకానికి చారిత్రక కొండవీటికొండ మీద నుంచి వర్షాకాలంలో నీరు జాలువారుతుంది. కందకంలోకి చేరిన నీటిని కొండవీడు పరిసరాల్లోని ఐదు గ్రామాల భూముల రైతులు సాగునీరుకు వినియోగించుకుంటున్నారు. చాలా కాలంగా సరైన మరమ్మతులు లేకపోవటంతో కందకం అడవి మాదిరిగా తయారైంది. భూగర్భ జలాల పెరుగుదలకు ఉపయోగపడుతుందని అధికారులు నివేదికలు రూపొందించారు.20 సెంట్ల కందకం ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించి రూపురేఖలు మార్చారు.ఎనిమిది అడుగుల లోతు గల కందకాన్ని పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టితో పూడ్చి వేసి చదునుచేశారు.కందకం పరిధిలో ఒకటి రెండు చోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టారు.


కొండవీడు దర్గా

కొండవీడులో సయ్యద్‌ ఖుదాదే ఫకిర్‌ షాఔలియా (దాదాపీర్‌) బాబా ఉరుసు జరుగుతుంది.వివిధప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.కొండవీడు నుంచి బాబా గంధ మహోత్సవం ఊరేగింపుగా బయల్దేరి తెల్లవారుజామున దర్గా వద్దకు చేరుతుంది.

వెన్నముద్దల వేణుగోపాలస్వామి విగ్రహం

మరెక్కడా లేదీ విగ్రహం:[1] చేత వెన్నముద్ద, చెంగల్వ పూదండ, మెడలో పులిగోరుతో సాధారణ బాలుడిగా చిన్ని కృష్ణుడు విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. కొండకిందనే ఛంఘీస్‌ఖాన్‌ పేట లో కృష్ణుని దేవాలయం ఉంది. అక్కడ వెన్నముద్దను చేతపట్టుకుని ఉండే బాలకృష్ణుని విగ్రహం ఉంది.కొండవీడులో నీరు, గాలి, వాతావరణం అనుకూలంగా ఉంటుందని ప్రపంచంలో ఎక్కడా కనిపించని వెన్నముద్దల వేణుగోపాలస్వామి విగ్రహం ఉన్న చెంఘీజ్‌ఖాన్‌పేట దేవాలయం ప్రాంతాన్ని రూ.150 కోట్లతో విశ్వవిఖ్యాత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్‌) తెలిపింది.


కత్తులబావి

కొండవీడు కోట పరిధిలో అత్యంత గుర్తింపు కలిగిన ప్రాంతం కత్తులబావి. దీన్నే గోపీనాథ దేవాలయం అని కూడా అంటారు. ప్రస్తుతం ఈ ఆలయంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.రాజుల హయాంలో అక్కడ మణులు, మాణిక్యాలు, బంగారం తదితర విలువైన లోహాలను భద్రపరచి ఉంటారనే అంచనాలతో చారిత్రక నిర్మాణాల తొలగింపునకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మొదటి మండపం కప్పునకు ఉన్న పెద్ద రాళ్లను తొలగించేశారు. అంతరాలయంలో ఉత్తర మండపానికి పక్కనున్న కుంభాకార స్తంభాన్ని కూడా తొలగించారు. కుంభాకార స్తంభం పునాదిని తవ్వుతున్నారు. అక్కడ ఏమైనా విలువైన వస్తువులు ఉండవచ్చనే దురాశతోనే అలా చేస్తున్నారని తెలుస్తోంది. అంతరాలయం పైకప్పును తొలగించారు. గర్భగుడినే కత్తులబావిగా భావించి విలువైన లోహాల కోసం విచ్చలవిడిగా తవ్వకాలను కొనసాగిస్తున్నారు.కత్తులబావిలో తవ్వకాల గురించి తెలుసుకున్న చంఘిజ్‌ఖాన్‌పేట, కోట, కొత్తపాలెం, హౌస్‌గణేష్‌ వాసులు అప్రమత్తులయ్యారు.కోటలో అభివృద్ధి పనులు ప్రారంభమై, ఒక కొలిక్కి వచ్చేంతవరకు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది.

కొండవీడు దుర్గంలో బౌద్ధం ఆనవాళ్ళు

  • ఇప్పటి వరకూ దుర్గం రెడ్డిరాజుల కోటగానే గుర్తింపు ఉంది. ఐతే, ప్రస్తుతం వారి పరిపాలనకు ముందు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే అక్కడ బౌద్ధనాగరికత ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.గుంటూరు సర్కిల్‌ అటవీశాఖ అధికారి అనూప్‌సింగ్‌ సతీమణి రుచిసింగ్‌, కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ కె.వి.రావుతో కలసి ఇక్కడ ఈ మధ్య నిధుల కోసం తవ్వకాలు జరిపిన శివాలయం పరిసరాల్లో బౌద్ధ స్థూపాన్ని గుర్తించారు. స్థూపం సుమారు 12 అడుగుల వ్యాసార్థంతో ఉంది. నిర్మాణానికి లేత ఆకుపచ్చ, నాపరాళ్లు, నలుపు రంగు రాళ్లు వాడారు.స్థూపం పైన శివాలయం నిర్మించారని తేల్చారు.
  • కొండవీడు కొండల మీద టెర్రాస్‌ స్థూపాలు కన్పిస్తున్నాయి. ఈ స్థూపాలు వేదికలాగా ఉంటాయి. ఇవి శాతవాహనుల కాలం నాటి పెద్దపెద్ద ఇటుకలతో నిర్మితమయ్యాయి. అలాగే బౌద్ధ విహారాల పైకప్పుల కోసం ఉపయోగించుకొనే పెంకులు, మట్టిపాత్రల శకలాలు కూడా ఇక్కడ దొరికాయి. కొండవీడు కొండలు సముద్ర మట్టానికి పదిహేడు వందల ముఫ్పై అయిదు అడుగుల ఎత్తులో ఉన్నాయి.శాతవాహనులు క్రీస్తు పూర్వం 1, 2 శతాబ్దాల నాటికి ధాన్యకటకాన్ని ముఖ్య పట్టణంగా చేసుకొని పరిపాలించారు.కొండవీడు కొండల మీద కూడా శాతవాహనుల కాలంలోనే బౌద్ధం వ్యాపించిందన్నందుకు ఆధారాలు దొరికాయి. ఈ కొండల మీద కాలిబాటకు రెండు వైపులా పైభాగంలో కూడా బౌద్ధ స్థూపాలను నిర్మించిన ఆధారాలు దొరికాయి. ఎత్తయిన కొండల మీద ఏటవాలుగా ఉన్న ప్రదేశాల్లో వేదికల మీద నిర్మించిన స్థూపాలను టెర్రాస్‌ స్థూపాలని అంటారు. గుంటూరు జిల్లాలోని అమరావతి, భట్టిప్రోలు, మల్లెపాడు(తెనాలి) లాంటి ప్రాచీన బౌద్ధక్షేత్రాల దగ్గర మాత్రమే అతి పెద్ద పరిమాణంలో యాభై ఎనిమిది సెంటీమీటర్ల పొడవు, ముప్ఫయి సెంటీమీటర్ల వెడల్పు, పది సెంటీమీటర్ల మందం కలిగిన పెద్ద ఇటుకలు దొరికాయి. అలాగే కొండవీడు కొండపైన చైనా దేశానికి చెందిన సెల్‌డన్‌వేర్‌గా పేరున్న కొన్ని పింగాణీ పాత్రలకు చెందిన ముక్కలు కూడా లభించాయి.


No comments:

Post a Comment