శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము

శ్రీ ముఖలింగం లేదా ముఖలింగం :- శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలానికి చెందిన గ్రామము. శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు 'పంచపీఠ' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు.


ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో వుం

ది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి.
ఇక్కడ లభించిన అధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో వుంది.
క్షేత్ర పురాణము

ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు.ఇప్పచెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో 'మధుకం' అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయం గా పేరొచ్చిందని అంటారు.

ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, సప్త మాతృకలలో ఆమె వొకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం.
భీమేశ్వరాలయం శిధిలావస్థలో వుంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి.
సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి.
           

ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా వున్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిధిలావస్థలో వుంది.
చరిత్ర

ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలుకూడ దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడ తెలుస్తోంది.
మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.





--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------




‘శ్రీముఖలింగం’ పేరులోనే చక్కని అర్ధం ఉంది. పరమేశ్వరుడు లింగంలో కని పించుట అని దీని అర్థం. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది. దేవాలయ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిబిరం. శ్రీముఖ లింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీముఖలింగేశ్వ రుని ఆలయానికి పక్కనే ఆంజనేయస్వామి ఆ లయం ఉంది. భక్తులు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న తరువాత ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. శ్రీముఖ లింగేశ్వరంలో మూడుచేట్ల ముక్కోణపు ఆకా రంలో మూడు ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వర ఆలయం. దీని కి అభిముఖంగా కొంత దూరంలో భీమేశ్వర ఆలయం ఉంది. 

ఈ రెండు ఆలయాలకు కాస్త దూరంగా ఊరి ప్రథమార్ధంలో అధునాతన వాస్తు పద్దతిలో అద్భుత సోయగాలు కురిపి స్తూ సోమేశ్వర ఆలయం భక్తులకు ఆహ్వానం పలుకుతున్నటుగా ఉంటుంది. ఇందులో ప్రతిష్టితమైన లింగాన్ని శ్రీముఖలింగేశ్వరుడు అంటారు. ఈ ఆలయంపై సుమారు 100 సంవత్సరాల క్రిందట పిడుగు పడింది. పిడుగు పడినప్పుడు ఆలయ శిఖరం దెబ్బతిన గా దానిని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా వారు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ మూడు ఆలయాల్లోనూ శిల్ప కళాసంపద చూపరులకు కనువిందు చేస్తుంది. ఈ ఆల యం చాణుక్య శిల్పకళా వైభవానికి దర్పణం పడుతుంది. ఈ ఆలయాలు క్రీశ 573-1058 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెపుతుంటారు.

శ్రీముఖలింగేశ్వరుని చరిత్ర...
శ్రీముఖలింగేశ్వరుని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం ఒక కుమ్మరి కుటుంబానికి సంతానం కలుగకపోవడంతో ఆ దంపతులు చాలా బాధపడేవారు. సంతాన ప్రాప్తికి కోరుతూ ప్రతిరోజూ శ్రీముఖలింగేశ్వ రుని దర్శించుకుని తమ విన్నపాన్ని వినిపిం చేవారు. తమకు సంతానం కలిగితే దేవుడికి పెద్ద గోలెం (తొట్టె) చేయిస్తామని మొక్కుకు న్నారు. దేవుని కరుణాకటాక్షాల మూలంగా వా ళ్ళకి ఒక కుమారుడు జన్మించాడు. ఆ దంప తుల ఆనందానికి అవధులు లేకుండా పోయా యి. తమకు సంతాన భాగ్యాన్ని కలుగజేసిన పరమేశ్వరుడికి మొక్కు తీర్చు కోవాలని భావించారు. వెంటనే పెద్ద గోలెం చేయించి గుడికి తీసుకు వెళ్ళారు. అది పెద్దది కావడం తో గుడి ద్వారంలో నుంచి లోపలికి తీసుకు పోవడానికి ఆస్కారం లేకపోయింది. దీంతో ఆ దంపతులు ఎంతో వేదనకు గురయ్యారు. తమ మొక్కుబడిని పరమేశ్వరుడు కావాలని తిరస్కరించినట్టుగా భావించిన ఆ దంపతులు తల్లడిల్లిపోయారు.

vishveshwaraఎంతో కష్టపడి దేవునికి చేసిన గోలెం గర్భగు డిలోకి ప్రవేశించనపుడు ఆ పరమేశ్వరుడు ప్ర సాదించిన బిడ్డను తాము స్వీకరించజాలమని భీష్మించుకున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యతను ఆ పరమాత్ముడిపైనే వేసి ఆ దంపతులిద్దరూ గోలెంలో ఆ బిడ్డని ఉంచి దేవాలయ ప్రధాన ద్వారం దగ్గరే దిగా లుగా కూర్చున్నారు. పడమటి కొండల్లోకి సూర్యుడు చేరుకున్నా దంపతులు మాత్రం పట్టు వీడలేదు. రాత్రంతా ఆలయం ముందు అలాగే కూర్చున్నారు. అయితే శ్రీముఖలింగే శ్వరుని కరుణ వలన ఇరుకుగా ఉండే దేవా లయ ముఖద్వారం ఎవ రూ గమనించని ఆ రాత్రివేళ కొంచెం విప్పారి ఎవరి ప్రయత్నం లేకుండానే గోలెం గుడిలో ఉన్న శివలింగం వెనుకకు వెళ్ళి కుదురుకుంది. తెల్లవారి మెల కువ వచ్చిన తరువాత వారంద రూ ఈ వింత ను చూసి ఆశ్చర్యపోయారు. ఇ ప్పటికి ఆ గోలెం దేవాలయంలో ఉన్నది. దీనిలో ఎప్పుడూ బియ్యం వేసి ఉంటారు. ఎప్పుడూ అన్నానికి లోటు ఉండదనడానికి ఇది సంకేతం.

చారిత్రక కథనం...
చాణుక్య రాజుల అనంతరం ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశీయులు ఈ దేవాలయాన్ని కొన్ని సంవత్సరాలు సున్నంతో కప్పి ఉంచారు. వారి తదనంతరం వచ్చిన ఒరిస్సా గజపతి రాజులు ఆలయానికి పూర్వ వైభవం తెచ్చారు. వారు కొన్ని వందల ఎకరాల భూమిని అర్చన కోసం దానం చేసారు. ప్రతి సంవత్స రం శివరాత్రినాడు జరిగే లింగోద్భవ కార్యక్ర మానికి పర్లాకిమిడి గజపతి మహారాజు శ్రీ ముఖలింగం వచ్చి శ్రీముఖ లింగేశ్వరునికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, తలంబ్రాలు బియ్యం సమర్పించేవారు. ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుంతోంది.

No comments:

Post a Comment