రాయదుర్గం

రాయదుర్గం

రాయదుర్గంఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక పట్టణం. మరియు అదే పేరుగల మండలము. మరియు ఇక్కడ తిరుమల లోని వేంకటేశ్వరస్వామి వారి ఆలయమును పోలిన ఆలయ శిథిలాలు కలవు. ఇక్కడి దేవాలయ శిఖరాన్ని లోహాలతో కాక చందనం తో తయారు చేసారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించక వదిలేయడంతో ప్రస్తుతం అవశేషాలు మాత్రం మిగిలాయి.
రాయదుర్గం పట్టణంలో పట్టు చీరలు నేయటం ఒక కుటీర పరిశ్రమ. ఇక్కడికి కర్ణాటక రాష్ట్ర సరిహద్దు 7 కి.మీ. దూరంలో ఉంది.


ఈ పట్టణము కర్ణాటక లోని బళ్ళారి కి 50 కి.మీ దూరంలో ఉంది. మరో వైపు 12 కి.మీ దూరంలో మొలకాళ్మారు(కర్ణాటక) అనబడే పట్టణమ ఇంకో వైపు కళ్యాణదుర్గం 40 కి.మీ దూరంలో ఉన్నాయి.ఇక్కడి జనాభా లో అధిక శాతం చేనేత కార్మికులు అయితే కాలక్రమేణ చేనేత పరిశ్రమ కుంటుపడడంతో జీన్స్ పరిశ్రమ ఊపందుకుంది. ఇప్పుడు ఈ ప్రాంతం జీన్స్ ప్యాంట్లుకు ప్రసిద్ధి. ఇది సరిహద్దు ప్రాంతం కావడం చేత ఇక్కడి ప్రజలు అధిక శాతం తెలుగు మరియు కన్నడ మాట్లడగలరు.



No comments:

Post a Comment