Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts

మహాబలేశ్వర్

 మహాబలేశ్వర్ భారతదేశంలోని మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక చిన్న పట్టణం మరియు మునిసిపల్ కౌన్సిల్. ఇది హిందువులకు పుణ్యక్షేత్రం ఎందుకంటే కృష్ణా నది ఇక్కడే పుట్టింది. బ్రిటిష్ వలస పాలకులు ఈ పట్టణాన్ని హిల్ స్టేషన్‌గా అభివృద్ధి చేశారు మరియు బ్రిటీష్ రాజ్ కాలంలో ఇది బొంబాయి ప్రెసిడెన్సీకి వేసవి రాజధానిగా పనిచేసింది.


భౌగోళిక శాస్త్రం

మహాబలేశ్వర్ పశ్చిమ కనుమల పర్వత సహ్యాద్రి శ్రేణిలో ఉంది, ఇది భారతదేశం యొక్క పశ్చిమ తీరం వెంబడి ఉత్తరం నుండి దక్షిణం వరకు నడుస్తుంది. పట్టణం యొక్క కోఆర్డినేట్లు 17.9250°N 73.6575°E. మహాబలేశ్వర్ 150 km2 (58 sq mi) విస్తీర్ణంలో ఉన్న ఒక విస్తారమైన పీఠభూమి, ఇది అన్ని వైపులా లోయలతో కట్టబడి ఉంది. ఇది విల్సన్/సన్‌రైజ్ పాయింట్ అని పిలువబడే సముద్ర మట్టానికి ఎత్తైన శిఖరం వద్ద 1,439 మీ (4,721 అడుగులు) ఎత్తుకు చేరుకుంటుంది. ఈ పట్టణం పూణేకు నైరుతి దిశలో 122 కిమీ (76 మైళ్ళు) మరియు ముంబై నుండి 285 కిమీ (177 మైళ్ళు) దూరంలో ఉంది.

మహాబలేశ్వర్ మూడు గ్రామాలను కలిగి ఉంది: మాల్కం పేత్, పాత "క్షేత్ర" మహాబలేశ్వర్ మరియు షిండోలా గ్రామంలో కొంత భాగం. మహాబలేశ్వర్ ప్రాంతం కృష్ణా నదికి మూలం, ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా బంగాళాఖాతం వైపు తూర్పున ప్రవహిస్తుంది. కృష్ణా యొక్క మూడు ఉపనదులు, కోయినా, వెన్న (వేణి) మరియు గాయత్రి, మహాబలేశ్వర్ ప్రాంతంలో కూడా వాటి మూలాన్ని కలిగి ఉన్నాయి. నాల్గవ నది, సావిత్రి కూడా ఈ ప్రాంతంలో దాని మూలాన్ని కలిగి ఉంది, కానీ పశ్చిమం వైపు మహద్ మీదుగా అరేబియా సముద్రం వరకు ప్రవహిస్తుంది.

ప్రాంతం యొక్క వాతావరణం స్ట్రాబెర్రీల సాగుకు అనుకూలంగా ఉంటుంది; దేశంలో మొత్తం స్ట్రాబెర్రీ ఉత్పత్తిలో మహాబలేశ్వర్ స్ట్రాబెర్రీ 85 శాతం వాటాను కలిగి ఉంది. ఇది 2010లో భౌగోళిక సూచిక (GI) ట్యాగ్‌ని కూడా పొందింది

వాతావరణం

మహాబలేశ్వర్‌లో సరిహద్దు ఉష్ణమండల రుతుపవనాలు/తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం (కొప్పెన్ ఆమ్/క్వా) ఉంది. రుతుపవనాలలో అతి భారీ వర్షపాతం సాధారణం. జూలైలో, ప్రతి సంవత్సరం 10-12 రోజులు 100 నుండి 200 మిమీ లేదా ప్రతి రోజు 4 నుండి 8 వరకు నిరంతర వర్షాలు కురుస్తాయి. 2018లో వెన్నా సరస్సు చుట్టూ మంచు మరియు నేల మంచు ఏర్పడినట్లు నివేదికలు ఉన్నాయి. ఆగస్టు 7, 2019న, మహాబలేశ్వర్‌లో 24 గంటల్లో 330 మిమీ లేదా 12.99 వర్షపాతం కొండచరియలు విరిగిపడ్డాయి. మహాబలేశ్వర్‌ను "ప్రపంచంలోని అత్యంత తేమగా ఉండే ప్రదేశానికి కొత్త అభ్యర్థి"గా అభివర్ణించారు, ప్రస్తుతం చిరపుంజి ఈ బిరుదును కలిగి ఉంది.

చరిత్ర

13వ శతాబ్దానికి చెందిన యాదవ పాలకుడు కృష్ణానది మూలం వద్ద ఒక చిన్న ఆలయాన్ని మరియు నీటి తొట్టిని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. జావాలి లోయ, మహాబలేశ్వర్ చుట్టుపక్కల ప్రాంతం, బీజాపూర్ ఆదిల్షాహి సుల్తానేట్ యొక్క సామంతులుగా ఉన్న మోర్ (వంశం)చే పాలించబడింది. 1656లో, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ, అప్పటి జావళి లోయ పాలకుడు చంద్రరావు మోరేని చంపి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ సమయంలోనే శివాజీ మహాబలేశ్వర్ దగ్గర ప్రతాప్‌గడ్ కోట అనే కొండ కోటను కూడా నిర్మించాడు.

రెక్కలు విప్పిన రివల్యూషన్

 రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 1

                                 


                            రెక్కలు విప్పిన రివల్యూషన్

                                   శ్రీశ్రీ

                 

    రివల్యూషన్ ఎక్కడో పుట్టదు. సామాన్య జనం గుండెల్లోనుంచీ, వ్యధార్తుల ఆకలి కేకల్లోంఛి ఊపిరి పోసుకునేది రివల్యూషన్....విప్లవం....
    చరిత్ర గతిని, మానవ ప్రవర్తనని మార్చిన మహాఘటన 1968 పారిస్ రివల్యూషన్.
    దాన్నే మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే....
    "ఇది 1968, మే నెలలో పారిస్ లో సంభవించిన విప్లవపు కథ. విప్లవాలు చరిత్ర యొక్క సంబరాలు. సాంఘిక వాస్తవికత సాంఘిక స్వప్నంలో కలిసిపోయే క్షణం (రతి కార్యం).
    అవి ఎందుకు సంభవింఛాయనడానికి చెప్పుకొనే కారణాలెప్పుడూ అసమగ్రమే. వాటి వర్ణణలెప్పుడూ పాక్షికమే.
    మే విప్లవం కనిపించే దానికోసమూ(తిండి), కనిపించిన దానికోసమూ (ఒక నూతన వ్యవస్థ) జరిగిన పోరాటం.
    ఈ కథని ఉత్ప్రేక్షలలోనే చెప్పాలి. అగత్యం, చైతన్యం ఆచరణని తెచ్చాయి"
    ఒక్క యూరోప్ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మానవ విలువలను సమూలంగా మార్చిన ఈ రివల్యూషన్ గురించి తెలుగుదేశం గర్వించదగిన మహాకవి శ్రీశ్రీ రాసిన పుస్తకం ఇది.

                            నాంది
    
    ఇది 1968, మే నెలలో పారిస్ లో సంభవించిన విప్లవపు కథ.
    విప్లవాలు చరిత్ర యొక్క సంబరాలు. సాంఘిక వాస్తవికత, సాంఘిక స్వప్నంలో కలిసిపోయేక్షణం (రతి కార్యం).
    అవి ఎందుకు సంభవించాయనడానికి చెప్పుకొనే కారణాలెప్పుడూ అసమగ్రమే. వాటి వర్ణనలెప్పుడూ పాక్షికమే.
    మే విప్లవం కనిపించే దానికోసమూ(తిండి), కనిపించనిదాని కోసమూ (ఒక నూతన వ్యవస్థ) జరిగిన పోరాటం.
    ఈ కథని ఉత్ప్రేక్షలలోనే చెప్పాలి.
    అగత్యం, చైతన్యం ఆచరణని తెచ్చాయి.
    నూతన వ్యవస్థ మీద తీసుకున్న పోలీసు చర్య ప్రస్తుత సమాజ కళేబరాన్ని వెలిగించింది. ఇందులో పాల్గొన్న నటుల స్వప్నాలకు స్ఫటిక స్వచ్చ స్వరూపాన్నిచ్చింది.
    కనిపించేదంతా దాదాపు పూర్తిగా వెనక్కిపోయిందనవచ్చు. కనిపించనిది ప్రజల మనస్సుల్లో ఉంది. పాల్గొన్న వారి మనస్సులో.
    ఈ విప్లవానికి పూర్వం, ఇక మారదేమో అనిపించేటంత ముసలిదైన తూకాన్నిది తారుమారు చేసింది.  
    ఈనాటి అన్యాయం వల్ల ప్రోదిగొన్న చిన్నచిన్న వ్యక్తిగత భయాలకన్న, నూతన వ్యవస్థ పట్ల పెంచుకున్న సామూహికమైన ఆశలే ఎన్నోరెట్లు బలిష్టమైనవి.

                                              1

    బూర్జువా వర్గానికి ఒక సరదా వుంది,
    అన్ని సరదాలను అపకీర్తిపాలు చెయ్యడం.
    ప్లాష్ బాక్_నాన్ టెర్ ఒక సమకాలీన నీతికథ.
    1963. బుధవారం. ప్రతివారం జరిగే మంత్రివర్గ సమావేశం. ఒక యూనివర్శిటీ నివేశనం కావాలి. (అభ్యుదయం).
    వీలయితే పారిస్ చుట్టుపక్కల్లో (ప్రణాళిక)
    అప్పటిసైన్యం మంత్రి మైస్మర్, అప్పటి విద్యామంత్రి పూషేతో (మే 68లో హోంమంత్రి) "పారిస్ కి పడమరగా నాన్ టెర్ వద్ద నాకో చిన్న భూఖండం ఉంది. కావలిస్తే నువ్వు దాన్ని వాడుకోవచ్చు." (రాజకీయం)
    అది బంజర్లూ, గుడిసెల ఊళ్లూ ఉన్న ప్రాంతానికి మధ్య ఒక విమానశాఖ డిపో.
    నాన్ టెర్ లేచింది _ 1968. కాంక్రీట్ తో, గాజుతో కట్టడాలు_ 16-17 వార్డులలో నివశించేనడి మీ తరగతి కోసం. ఇంకా సంపన్న ప్రాంతాలు. పట్టణ సమాధులు. కార్లకి పార్కింగ్ స్థలాలు. లెక్కలేనన్ని, సంపన్నుల సుపుత్రుల కోసం. ఈ కుర్రాళ్ళు ఉమ్మడి కుటుంబంలోనే వుంటూ మమ్మీ (మాతృదేవత), సొంత కార్లు వాడుతూ ఉంటారు. (కుటుంబం)
    భవనాల చుట్టూ, అరబ్బులు, బుడత కీచుల దరిద్రపు గుడిసెలు.
    జీవితపు అంచులలో బక్కచిక్కిన కుర్రాళ్లు, పుట్ బాల్ ఆడుతూ (పైకి కనిపించే ఎముకలు! వాళ్ళు వాడే బూతులు!) పొగగొట్టాలు, కౌన్సిల్ భవనాలు, బంజరు భూములు. గోడల మీద పిచికారీ పిస్తోలుతో వ్రాసిన:
    నాగరికత, పరిశుభ్రత, రతిక్రీడాపరాయణత.
    12 వేల స్టూడెంట్లు, 15 వందల హాస్టళ్ళలో.
    వారానికోసారి డాన్సింగ్. రెండుసార్లు సినీ క్లబ్బు. మిగతా రాత్రులంతా టెల్లీ. (టెల్లీ అంటే టెలివిజన్)టెల్లీ ప్రజలకు నల్లమందు, మేధావుల ఆత్మహింసా సాధనం. (సంస్కృతి)
    ఒకగోడ మీద పురుగులాగ నీమొహాన్ని కిటికీగాజు తలుపుకి కొట్టుకొని కుళ్లిపో.
    చక్కని స్టెరిలైజ్ చేసిన గదులు: పెద్దగాజు కిటికీలు _ అరబ్బీ మైదానాలు కనిపిస్తూ "పరాయి" దేశీయులకు ప్రవేశం లేదు. ఫర్నిచర్ మార్చకూడదు. కొత్తవి చేర్చకూడదు. వండుకోకూడదు. యూనివర్శిటీ ఆవరణలో రాజకీయాలు నిషేధం.
    బయట గోడల మీద: ఇక్కడితో స్వేచ్చ అంతమవుతుంది.
    అమ్మాయిలు(21 ఏళ్ళు దాటితే, లేదా తల్లిదండ్రుల ప్రత్యేకానుమతి ఉంటే) అబ్బాయిల గదుల్లోకి వెళ్ళవచ్చు. కాని అబ్బాయిలు అమ్మాయిల గదుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఎంచేతంటే_ మంత్రిగారి మాటల్లో_ ప్రకృతికి తన నియమాలు తనకున్నాయి. వాటిని మరిచిపోవడం కంటే అంగీకరించడం మంచిది. అదీకాక _మంత్రి ఉవాచ_ 'బాలికలకు తమ ఆడ ప్రపంచంలో బాలురు ప్రవేశించడం నిజంగానే ఇష్టం వుండదు' (నీతులు).
    ఒక పిడికెడు మంది మావోయిస్టులూ, ట్రాట్సీయిస్టులూ, అనార్కిస్టులూ, సిట్యుయేషనిస్టులూ, ఔను, వీరితో బాటు కాన్ బాందీ. (తీవ్రవాదాలు)
    అదీ, ప్రళయానికి పూర్వం.
    సాంఘిక శాస్త్ర విద్యార్థులచే ఎక్కువ చైతన్యం. కాని మిలిటెంట్లు శూన్యంలో పనిచేస్తారు. జనాన్ని సమీకరించడానికి వాళ్లకు ఉన్నదొకే సమస్య. వియత్నాం. (ఎడమపక్షపు పుక్కిటి పురాణాలు, అధిక సంఖ్యాకులను దూరం చేసుకోవడం, కొద్దిమంది అర్థం చేసుకున్నవాళ్లు).
    నల్ల జాబితాలో కొన్ని పేర్లు. మిలిటెంట్ల పేర్లు. పిల్లల తండ్రీ, ఉదారవాదీ అయిన యూనివర్శిటీ విద్యాధికారి గ్రాపస్, అసలు నల్లజాబితా లేదు మొర్రో అంటాడు.

 

Click here for full pfd

మ్యూజింగ్స్ -2 -- గుడిపాటి వెంకట చలం


   


   మ్యూజింగ్స్ -2

 

 

                                                        చలం

                       

    గుండ్రంగా బలిసిన పిల్లి యెండలో పడుకుని వుంది__తెల్లని పిల్లి. దాన్ని చూస్తే మా వూళ్ళో నిత్యసంతోషిగా కనపడే స్త్రీ సంఘోద్ధారకురాలు ఒకామె జ్ఞాపకమొస్తోంది. చాలామంది కిట్లా గట్టి పోలికలుంటాయి. ఒక మిత్రుడి మొహం దేనినో పోలివుందని, ఆ వుపమానం మనసుకి స్ఫురించక చాలా నెలలు వూరుకున్నాను. మొన్న బస్సుకి అడ్డంగా నుంచున్న ఒక ఒంటెను చూసేటప్పటికి ఆ ఒంటె మూతికోసం ఇన్నాళ్ళు వెతుకుతున్నాననిపించింది. ఆ పిల్లి యిట్లా పడుకుందా ఎండలో కళ్ళుమూసుకుని, దాని కళ్ళు చుట్టూ ఎగిరే పిచ్చికల మీదే వున్నాయి. దానికి ఆ పిచ్చికలు యీకలు కట్టుకున్న లడ్డుండల్లాగూ, ఎగిరే ఇడ్డెనల్లాగూ కనిపిస్తాయి గావును! చేతులో కానీ లేక మిఠాయి దుకాణం ముందు నుంచున్న కుర్రాడి బాధగావును దానికి! పిల్లి జన్మలో పాపం అనుభవించే పద్ధతి అదేమో!
    చెరువునించి నీళ్లు మోస్తో సీత గుమ్మం ముందునుంచి వెళ్ళినప్పుడల్లా నావంక చూస్తోంది. ఏమిటా ఆకర్షణ? పట్టణం మొగవాడు. అధికారి. అదిగాక పూర్వానుభవాల స్మరణ కొంతవరకు పనిచెయ్యవొచ్చు. ఏమిటా ఆశ? ఏమో! ఏ ఐదు నిమిషాలో దొరకవా అనా? అంతమాత్రము యోచనా వుండదు. పిల్లి అట్లా పిచ్చికల వంక ఎందుకు చూస్తూ వుంది? ఏమిటా ఆశ? ఏమీలేదు అట్లానే! అంతే సాధారణంగా యీ సంబంధాలలో దొరికేది ఆ ఐదు నిమషాలే. అట్లాంటప్పుడు కవిత్వానికీ రొమాన్సుకీ వ్యవధి యేదీ? అందువల్లనే స్త్రీకి ప్రేమ అనగానే కటికినేల జ్ఞాపకం వస్తుంది, యీ పల్లెటూళ్ళలో_ ముఖ్యంగా కనిగిరిలో! ఏం? సుబ్బారావ్ c/of గంగానమ్మ! ఏమంటారు?
    పురుషుణ్ణి వెతుక్కోడానికి అలవాటయిన స్త్రీ చూపులు అదో విధంగా తయారవుతాయి వేశ్య చూపులు వేరు. అవి ధనం కోసం వెతుకుతాయి. ఈ స్త్రీల చూపులు మోహం కోసం - కాదు అవయవాల కోసం వెతుకుతున్నాయా అన్నంత అసహ్యంగా వుంటాయి. మరీ __ మ్మకి దేహమంతా, (మనసు కూడానేమో!) అంతా కూడా ఒక్క అవయవం చుట్టూ యేర్పడ్డ సహాయక ప్రదేశం వలె వుంటుంది.
    కొంతమంది స్త్రీలలో ఆకర్షణ పువ్వుల్నీ, చల్లని నీలపు నీటినీ, జ్ఞాపకం తెస్తుంది. ఎంతైనా కళ్ళవేపూ పెదవుల వైపే నిలుస్తుంది ఆరాధకుడి దృష్టి. స్త్రీలో ఔన్నత్యం తలుచుకున్నప్పుడల్లా చిన్న జ్ఞాపకం వస్తుంది. నేను చేసిన నిరాకరణా, ఆత్మత్యాగమూ అనవసరము అర్ధవిహీనమూనా? ఇట్లాంటి సంయోగాలకీ వియోగాలకీ ఆ రెంటి మధ్యా, వ్యక్తమై బాధించిన సంకోచాలకీ, త్యాగాలకీ, విచారాలకీ అంతం, సాఫల్యం, ఏమైనా వుందా, లేక ఆ అనుభవమే ఆ త్యాగమిచ్చిన మాధుర్యమే అంతమా? కాని ఇంకేం సఫలం కావాలీ? చి__ని మళ్ళీ కలుసుకోవాలా? ఈ లోకంలోనో ఇంకో లోకంలోనో ఆమెనించి కృతజ్ఞతను పొందాలా? ఇక్కడ మధ్యలో త్యజించిన ప్రేమ అనుభవాన్ని మళ్ళీ "కంటిన్యూ" చెయ్యాలా? ఇట్లాంటి ప్రశ్నలకి ఇష్టమయిన 'హాప్ ఫుల్' సమాధానాలు చెప్పుకుని ఎంతమంది ఆ కలలలో ఆనందపడడం లేదు? ఈ త్యాగాలకి హర్షించి భగవంతుడు ఊర్ధ్వ లోకాలు కటాక్షిస్తాడనీ, ఇంకో జన్మలో సౌఖ్యాలు ఏర్పాటు చేస్తాడనీ, ఆమెనే ప్రియురాల్ని చేస్తాడనీ, కరుణించి ఆ వ్యక్తినే ముసలితనములో ప్రసాదిస్తాడనీ ఎంతమంది, ఎన్ని మతాలవారు, ఎన్ని విధాల నమ్మటం లేదు! ముఖ్యంగా కర్మలో నమ్మే యీ దేశస్థులకి ప్రతి పనికీ ప్రతిఫలం యెదురుచూడడం అలవాటయిపోయింది. ప్రతిఫలం ఆ త్యాగంలో తప్ప ఇంక లేదనే నమ్మితే యిన్ని దొంగ ధర్మాలూ, కపటపు నీతి వర్తనలూ, వుండవు కాని ఏ భవిష్యత్తులోనూ నమ్మకం లేని నాబోటి వాళ్ళకు ఒక idea కోసం ఆదర్శం కోసం శరీర సుఖాన్ని - అందులో ప్రేమానందాన్ని త్యాగం చెయ్యడం దుష్కరమౌతుంది. ఎవర్ని ప్రేమిస్తున్నామో వారి క్షేమానికయితేనే గాని ఏ త్యాగమూ అర్ధవిహీనంగా కనపడుతుంది. కాని ఆమె క్షేమం కోసం మాత్రం నేనెందుకు త్యాగం చెయ్యాలి, ఆ త్యాగం వల్ల ఆమె నా చేతులోనించి జారిపోయేటప్పుడు? అయినా నా త్యాగం ఆమెకి క్షేమమని నమ్మకమేమిటి? ఆమె నా త్యాగానికి feel అవుతుందా, నన్ను admire చేస్తుందా?
    హృదయ తృప్తితప్ప సమాధానం లేదు. అంటే ... అంతరాత్మా! మతాలు బోధించే అంతరాత్మా!
    అంతరాత్మ అనేది వుందా? వుంటే అందరికీ ఒకే విధమైన అంతరాత్మా! మరి దేశకాల పరిస్థితులతో మారుతుందేం?
    చి__ని నేను కలుసుకోవాలని ప్రతి నిమిషం హృదయం దహిస్తుంది. కాని కలుసుకుంటే! తరవాత! ఆ పునస్సమాగమంలో నించి జనించిన అగ్ని ఎన్ని జీవనాల అగ్ని ఎన్ని జీవనాల ఆనందాన్ని ఆహుతి తీసుకుంటుంది?
    __న్నా! ఏం లాభం లేదు. మనిద్దరం ఇట్లా పరితపించి మళ్లీ కలుసుకుంటే మాత్రం యీ వేదన అంతమౌతుందా? ఎంతో దగ్గిరగా మనం కావిలించుకున్నా, ఎంత కాలం ఒకర్ని ఒకరం విడవకుండా కళ్ళలోకి చూసుకున్నా మనకీ హృదయ తాపం తీరుతుందా? తనివితీరా ముద్దు పెట్టుకోడం అని వ్రాస్తారుగాని నిజంగా ముద్దులతోగాని, ఇంకా దేహ ఐక్యంవల్లగాని తనివితీరే ప్రేమ చాలా అల్పం. ఆ మనుషులు చాలా అల్పులు, నన్ను నీకూ, నిన్ను నాకూ ఇంత ఆకర్షకంగా చేసి అగ్ని త్యాగాలకు పురికొల్పే యీ శక్తి ప్రత్యేకమయిన మన హృదయ దాహం కాదు. మన ఆత్మ ఔన్నత్యమే ఇట్లా వేరుపరిచింది మనని నిరంతరం అగ్నితో కాలుస్తోంది.
    "ఇంత పరాకా..." అని విన్నప్పుడల్లా, నిన్ను మరిచానని, ఆపాట పాడుతున్నవేమోనని వులికిపడి, నీ తేపిలో తడిసిన పదాలూ, పెదవులూ, చీకట్లో నీ చూపులు, తివాసీ, అన్నిటి జ్ఞాపకాలతోనూ పరాకులో పడతాను. "ఇంత పరాకా_" నాకు కాకుండా చేశావు నువ్వు పాడి.
    "ఈనాడు నన్నిట్లా పూజిస్తున్నావు సరే. ఇదివరకెందర్ని పూజించలేదు నువ్వు?" అన్నావు.
    "నీకెట్లా తెలుసు?"
    "నీ కథలు; నీ లేఖలు..."
    "కాని నీమీది వాంఛ వేరు."
    "నమ్మాననుకో. ఇకముందు? నాకన్న నువ్వు వాంఛించే వ్యక్తే ముందు ఎప్పుడో ప్రత్యక్షమయితే..."
    "కాదు."

 

Read more Click here

తల్లి మనసు కధలు పేజి

  తల్లి మనసు కధలు పేజి 1

                                 


                                        తల్లి మనసు
                                                                               డి. కామేశ్వరి

 

                                        

   
    పావుతక్కువ తొమ్మిదయింది . కమల గబగబ జడ అల్లుకుని, ముఖానికి యింత పౌడరద్దుకుని వంటింట్లోకి వెళ్ళింది.
    పొయ్యి మీద యింకా ఏదో వుడుకుతూనే వుంది. అత్తగారికింకా గిన్నెలతో కుస్తీ పడుతుంది. వంటకాలేదన్న మాట! తెలిసినా అడిగింది కమల "వంటయిందాండి.... తొందరగా ఆఫీసు కెళ్ళాలి యివాళ ...."
    "ఆ! ఆ ! అవుతుంది. చూస్తున్నావుగా నేనేం కూర్చున్నాన్నా! అక్కడికీ రోజుకంటే అరగంట ముందే మడికట్టు కున్నాను. ఉడకాలా వాటితో పాఫు నేనూ వుడుకుతానా? ఇదిగో యీ పప్పుదింపి ఆ పులుసు పోపు కూరపోపు వేసి పెడ్తాను.... దిక్కుమాలిన కర్రలు మండి చస్తేనా? ఊదిఊది నోరు పడిపోతుంది కళ్ళు పోతున్నాయి...." సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది.
    ఈ భాగోతం రోజూ వినేదే కనుక కమల ఆ మాటలు వినకుండా పీటవాల్చుకుని కంచం పెట్టుకుని, మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. "ఎంతవరకయితే అదే పెట్టేయండి. తొమ్మిదిన్నరకి అక్కడుండాలి నేను. ఇన్ స్పెక్టన్ వుంది. "ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని; అయినా ఆవిడకేం లెక్క! వుండవే అలా కాళ్ళ క్రింద నిప్పులు పోసేస్తే ఎలా చస్తాను ----" అంటూనే పప్పులో యింక ఉప్పు వేసి కుమ్మి అదే యింక కంచంలో పడేసింది. తీర్దానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఒగిన్నేలో పోసింది. ఉమ్మగిల్లని అన్నం యింత పడేసింది కంచంలో . "కూర అవనీయవు.... ఏం ఉద్యోగాలో నీవే చేస్తున్నట్టున్నావు..... నిన్నటి చింతకాయ పచ్చడి వేయనా ...." అదో యింత ముద్ద పడేసింది సుబ్బమ్మ.
    కమల దేనికి జవాబియ్యకుండా ఊదుకుంటూ యింత పప్పు అన్నం కలుపుకుని తిని మజ్జిగ వేసేసుకుంది.
    "అయ్యో రాత! ఏమిటే ఆ తిండి " సుబ్బమ్మ నోరు వాగుతూనే వుంది. కమలకిదేం క్రొత్తగాదు యీ యింట్లో ఏనాడో చెవులు, నోరు మూసుకోవడం అలవాటయింది కమలకి.
    ఇదేం క్రోత్తా! రోజూ ఆఫీసు వేళకి యింత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు, అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది . మజ్జిగ త్రిప్పుతుంది. గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమిరిస్తే ఆ వంట కాస్తా వండటానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది. ఆవిడ మడికి పనికిరాదని వూరుకోడం గాని యీ మాత్రం వంట అరగంటలో వండి, తిని, ఆఫీసు కెళ్ళగలదు తను. రోజూ యిలాంటి భోజనం అలవాటే, ఉడికీ ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగీ కాగాని పులుసుతో ఏదో యింత నోట్లో పడేసుకుని అదర బాదరా అఫీసుకి పరిగెత్తడం తనకి ఆయనకీ అలవాటే రోజూ ! ఈతిండితో సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూరకాడల్లా వాడిపోవడమూ అలవాటే. మధ్యలో అక్కడ త్రాగేది కప్పు కాఫీ!
    "వాడెడి ? వాడు రాకుండానే తినేసి పోతావుటే....?"
    కమల జవాబు చెప్పకుండా కంచం ఎత్తి మూలపడేసి చేయి కడుక్కుంది.
    ఆయనగారు తిన్నాక అవిస్తట్లోనే తినాలి. పతివ్రతా ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీసుకి వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం తోచదు కాబోలు! మొగుడంటే భక్తీ గౌరవం లేనట్టు లెక్క గాబోలు ముందు తింటే !
    ఆఫీసులో ఇనస్పెక్షన్ వుంది. తొమ్మిదిన్నరకి అక్కడ ఉండాలి. రెండు బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే తొమ్మిదయింది ... ఆయనగారు వచ్చి అయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది ?
    కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల. గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకుని బేగు రుమాలు తీసుకుని గబగబ వెళ్ళింది వీధిలోకి.
    గుమ్మంలోనే ఎదురు పడ్డాడు సుబ్బారావు . సైకిలికి ఎడాపెడా సంచులు తగిలించుకుని "అప్పుడే ఎక్కడికి బయలు దేరావు?" భార్యని చూసి అడిగాడు.
    "ఆఫీసుకి."
    "తొమ్మిదే అయింది ఎందుకా తొందర భోం చేసి వస్తాను, వుండు వెడదాం.'
    "నాకు పనుంది. తొందరగా వెళ్ళాలి. మీరు తర్వాత వెళ్ళండి. ' తప్పించుకొని మెట్లు డిగింది కమల.
    "ఏమిటో ఆ అర్జంటు పని ! ముందెళ్ళి అందరితో బాతాఖానీ కొట్టాలా వెళ్ళు ..... వెళ్ళు.... అక్కడే కబుర్లు నీకోసం చూస్తుంటాయి."
    "ఏదీ పోనీ పాపం బస్సులు అవి వంటరిగా మారలేదని" కమలకు వళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడి వైపు. 'అవును బాతాఖానీ కొట్టడానికే వెడుతున్నాను. దారి వదలండి' రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబీయటం ఇష్టం లేక మొహం త్రిప్పుకుని వడివడిగా వెళ్ళింది కమల. సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు.
    బాతాఖానీ కొట్టడానికి వేడుతూందిట..... 'అందుకోసం గంటముందు తిండన్న తినకుండా ఆదరాబాదరా బయలుదేరింది ! హ ఏం మగాళ్ళు! ఓ పావుగంట ముందు వెడితే ఎందుకోనని అనుమానం! ఆఫీసులో మొగాళ్ళతో పెళ్ళాం ఖాతాఖానీ కొడుతుందేమోననే మొగాళ్ళు  భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశ పెట్టడం! భార్య తెచ్చే డబ్బు కావాలి! కాని ....ఆభార్య తోటి ఉద్యోగాస్తునితో నన్నా ఓ మాట మాట్లాడకూడదు నవ్వకూడదు. తలవంచుకొని ఆఫీసుకెళ్ళి ఇంటికి రావాలి. ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకుని పైకి పెద్ద ఆదర్శ వాదుల్లా అభ్యుదయ భావాలు గల వారిలా భార్యని ఉద్యోగం చేయిస్తున్నట్టు ఫోజు....! .... హ బస్సులు ఎక్కలేదట! ఏ బస్సులు ఎక్కకుండానే రెండేళ్ళ బట్టి ఉద్యోగం చేస్తుంది గాబోలు! ఎంత చులకన ..... పెళ్ళాం అంటే ..

 

Full PDF  Click Here