ఉండవల్లి



ఉండవల్లి


ఉండవల్లిగుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన గ్రామము. ప్రకాశం బ్యారేజి దాటగానే "తాడేపల్లి సెంటర్" వస్తుంది.కానీ ప్రకాశం బ్యారేజి పై బస్సు సదుపాయం లేదు. తాడేపల్లివిజయవాడకు 2కీ.మీ.లు, మంగళగిరికి 5కీ.మీ.ల దూరంలో ఉంది. ఆ సెంటర్ నుండి అమరావతి వైపుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండవల్లి కలదు. ప్రసిద్దమైన ఉండవల్లి గుహలున్నదిక్కడే.


              




గుహాలయాలు

ఈ గుహాలయం ఒక పర్వత సముదాయం. పర్వత ముందు భాగమునుండి లోపలికి తొలచుకుంటూ వెళ్ళడం చేసారు. మద్యలో స్థంబాలు వాటిపై చెక్కిన అందమైన లతలు, గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మెదలైన వాటితో విశాలంగా ఉంటుంది. ఇవి క్రీ.శ. 4, 5 వ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతిలో అనంత పద్మనాభ స్వామి శిల్పం చెక్కబడి ఉంది. ఇతర ఆలయాలు త్రిమూర్తులు అయిన బ్రహ్మవిష్ణువుశివుడు దేవతలకు ఉద్దేశించినవి.     ఇవిగుప్తుల కాలంనాటి ప్రధమ బాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటి. ఈ పర్వత గుహలలో పెద్దదైన ఒక గుహాలయము కలదు. ఈ గుహాలయములో లోదాదాపు 20 అడుగులపైబడి ఏకరాతితో చెక్కబడిన అనంతపద్మనాభస్వామి వారి ప్రతిమ ఉంటుంది. ప్రతిమ పొడవుగా శేషపానుపుతో కూడి గుహాంతర్బాగమున కమలంలో కూర్చున్న బ్రహ్మ మరియు సప్తర్షులుఇతర దేవతల విగ్రహాలూ కలవు. పర్వతము బయటివైపు గుహాలయ పైభాగములో సప్తఋషుల విగ్రహాలు పెద్దవిగా చెక్కారు. ఒకే పర్వతాన్ని గుహలుగానూ దేవతాప్రతిమలతోడను ఏకశిలా నిర్మితముగా నిర్మించిన శిల్పుల ఘనత ఏపాటిదో ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. ఈ గుహల నుంచి పూర్వ కాలంలో మంగళగిరి వరకు సొరంగ మార్గం ఉండేదని మన పూర్వీకులు చెప్పేవారు. ఈ మార్గం నుండి రాజులు తమ సైన్యాన్ని శత్రు రాజులకు తెలియకుండా తరలించేవారని ప్రతీతి.
ఈ గుహల నిర్మాణ శైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంది. ఆలయాల చుట్టూరా పచ్చని పంటపొలాలు కనువిందు చేస్తాయి.
ఈ గుహాలయాలు క్రీ.శ. 420 నుండి 620 వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవి. అనంత పద్మనాభ స్వామి, నరసింహ స్వామి ఇక్కడ కొలువైన దేవుళ్ళు.



No comments:

Post a Comment