జయంత్ యాదవ్
స్వదేశంలో భారత్ ఆడుతున్నప్పుడు జట్టులో ఉన్న స్పిన్నర్లకు అదనంగా మరో స్పిన్నర్ అవసరం అయినప్పుడు జయంత్ యాదవ్‌ను సెలెక్టర్లు ఎంపిక చేసేవారు. అయితే ప్రస్తుతం అయితే చాలా మంది యువకులు దేశవాళీల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. దానికితోడు జయంత్ రికార్డు కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు.
భారత్ తరఫున ఆరు ఏళ్ల క్రితం అరంగేట్రం చేసిన అతను ఇప్పటి వరకు కేవలం ఆరు టెస్టు మ్యాచులే ఆడాడు. గతేడాది మార్చిలో శ్రీలంకతో జరిగిన టెస్టులో ఎవరూ ఊహించని విధంగా జయంత్‌కు అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌లో కూడా అతను పెద్దగా రాణించలేదు. రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. అలాంటి ఆటగాడికి మళ్లీ టీమిండియాలో ఆడే అవకాశం రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
అజింక్య రహానే
రెండేళ్ల క్రితం వరకు టీమిండియా టెస్టు జట్టులో మూలస్తంభంలా నిలిచిన ఆటగాడు అజింక్య రహానే. కోహ్లీ గైర్హాజరీలో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా గెలిపించాడు. అయితే ఆ తర్వాత రహానే పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. అతనితోపాటు ఫామ్ లేక తంటాలు పడిన పుజారా కౌంటీల్లో ఆడి మళ్లీ గాడిన పడగా.. రహానే మాత్రం పునరాగమనం చేయలేకపోయాడు.
ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ వంటి నాణ్యమైన ఆటగాడు రహానే స్థానాన్ని ఆక్రమించాడు. దీనికితోడు రహానే ఇటు దేశవాళీల్లో కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇలాంటి సమయంలో రహానేకు మళ్లీ టీమిండియా నుంచి పిలుపు రావడం, అది కూడా ఈ ఏడాదిలో రావడం జరగని పని.
దినేష్ కార్తీక్
టీమిండియాలోకి దినేష్ కార్తీక్ పునరాగమనం చందమామ కథలాంటిది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతంగా రాణించిన అతన్ని టీ20 వరల్డ్ కప్ కోసమే జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. అయితే ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ రెండింట్లోనూ అతను పెద్దగా రాణించలేదు. 2022లో మొత్తం 22 టీ20 మ్యాచుల్లో ఆడిన అతను 141.38 స్ట్రైక్ రేటుతో 287 పరుగులు చేశాడు.
కానీ టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ 37 ఏళ్ల ఫినిషర్‌ను సెలెక్టర్లు మళ్లీ ఎంపిక చేయలేదు. అతని స్థానంలో కుర్రాళ్లకు చోటివ్వాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఐపీఎల్‌లో డీకే చెలరేగినా.. టీమిండియాలో చోటు దక్కడం కుదరని పనిగా కనిపిస్తోంది.
No comments:
Post a Comment