లేపాక్షి
లేపాక్షి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణము. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 16 కి.మీ. దూరంలో ఉంటుంది. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి సమీపంలోనె మధ్య యుగం నాటి శిల్ప కళా నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడ ఆరు బయట దాదాపు ముప్పై అడుగుల ఎత్తు నాగ పడగ నీడలో వున్న శివలింగం ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్థంభాలు, మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి సుందరముగా ఉంటుంది.
ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూలవిరాట్టు వీరభధ్ర స్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహము ఉన్నది. . వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని చూపులు నేరుగా ఊరి మీద పడ కూడదు అని గుడి ద్వారం కొంచం ప్రక్కకు వుంటుంది. గుడి లోని పైకప్పు మీద కలంకారి చిత్రాలు అద్భుతంగా వేయబడ్డాయి. ఈ గుడి మండపం లో అన్ని స్థంబాలు క్రింది ఆదారానికి ఆనుకొని వుంటే ఒక్క స్థంబం మాత్రం క్రింద ఏ ఆదారము లేకుండా వున్నది. క్రింద సుమారు పావు అంగుళం మేర స్థంబం అడుగు బాగానికి కిందనున్న ఆదారానికి మద్య ఖాళి వున్నది. దానిని నిర్థారించు కోడానికి ఒక బట్టను దాని క్రింద దూర్చి బయటకు తీస్తారు. శిల్ప కళా రీతిలో ఇదొక పద్దతి. ఏ కారణం చేతనైనా మండపం కూలి పోయేటట్లయితే అనగా భూకంపము వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ముప్పుకు స్థంబాలు స్థాన బ్రంశం కలిగితే ఆ సమయంలో ఈ వేలడె స్థంబం క్రిందికి ఆని ఏ ఒక్క స్థంబము పడి పోకుండా అన్ని స్థంబాలను కట్టడి చేస్తుందట. ఇదొక నిర్మాణ చాత్రుర్యము. ఇదొక రహస్యము. సాధారణ ప్రజలకు ముఖ్య ఆకర్షణ. .
ఈ ఆలయంలోని అసంపూర్ణంగా వున్న కళ్యాణ మండప నిర్మాణ చాతుర్యం ఆచ్యర్యాన్ని కలిగిస్తుంది. దీనిని పూర్తిగా నిర్మించి వుండి వుంటే ఇంకెంత అందంగా వుండేదో..... ఈ ఆలయ ప్రత్యెకత మరొకటి ఏమంటే మండపం పై భాగాన (పై కప్పుకు) వేసిన రంగు రంగుల కలంకారి బొమ్మలు. కాల గమనంలో ఇవి చాల వరకు మాసి పోయినా ఆనవాలుగా ఇంకా కొన్ని మిగిలి వున్నాయి. ఈ కలంకారి బొమ్మలు నేటి చిత్రకళా విధ్యార్తులకు చక్కటి పాటాలు. ఇటు వంటి కలంకారి బొమ్మలు, కదిరి నరసింహాలయంలోను, హంపి లోని విరూపాక్షాలయంలోను కనబడతాయి.
No comments:
Post a Comment