అరసవిల్లి

అరసవిల్లి


పూర్వము శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం మండలంలో ఉన్న గ్రామం. ఇప్పుడు (2008)శ్రీకాకుళం పట్టణానికి కలిపి వేసి మున్సిపాలిటీ లో ఒక వార్డుగా పరిగణించడమైనది. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ది చెంది ఉన్నది. ఒకప్పుడు ఈ గ్రామాన్ని "హర్షవల్లి" అనేవారని క్రమ క్రమంగా "అరసవిల్లి" అయిందని చెపుతారు.

  


దేవాలయ చరిత్ర


ఇక్కడి సూర్యదేవాలయం లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. ఇక్కడ లభించిన శాసనాలు క్రీ.శ. 7 వ శతాబ్థానికి చెందినవి. అందువల్ల యిది ప్రాచీన దేవాలయం అని చెప్పవచ్చు. భారతదేశం లో ఉన్న కొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. (ఒరిస్సాలో సుప్రసిద్ధమైన కోణార్క్ సూర్యదేవాలయంలో సైతం ఇక్కడి మాదిరిగా ఇప్పుడు నిత్యపూజలు జరగడంలేదు[ఆధారం కోరబడినది]). ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు కొందరు పురావస్తు శాస్త్రజ్ఙులు పేర్కొన్నారు.
ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా వుంది. సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట. 150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి , అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ది చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ వుంది.
ప్రతి సంవత్సరం రథసప్తమినాడు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.


ఆలయ విశేషాలు

ఈ దేవాలయంలోని ఒక మహత్తరమైన విషయం, సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడటం. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. కంచి లోని కామేశ్వరాలయంలో కూడ యిలాంటి ఏర్పాటు వుంది. ప్రతి సంవత్సరం మార్చి,అక్టోబర్ లలొ ఇది జరుగుతుంది.(3-10-10) న జరిగింది.

శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము

శ్రీ ముఖలింగం లేదా ముఖలింగం :- శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలానికి చెందిన గ్రామము. శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు 'పంచపీఠ' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు.


ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో వుం

ది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి.
ఇక్కడ లభించిన అధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో వుంది.
క్షేత్ర పురాణము

ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు.ఇప్పచెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో 'మధుకం' అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయం గా పేరొచ్చిందని అంటారు.

ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, సప్త మాతృకలలో ఆమె వొకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం.
భీమేశ్వరాలయం శిధిలావస్థలో వుంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి.
సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి.
           

ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా వున్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిధిలావస్థలో వుంది.
చరిత్ర

ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలుకూడ దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడ తెలుస్తోంది.
మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.





--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------




‘శ్రీముఖలింగం’ పేరులోనే చక్కని అర్ధం ఉంది. పరమేశ్వరుడు లింగంలో కని పించుట అని దీని అర్థం. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది. దేవాలయ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిబిరం. శ్రీముఖ లింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీముఖలింగేశ్వ రుని ఆలయానికి పక్కనే ఆంజనేయస్వామి ఆ లయం ఉంది. భక్తులు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న తరువాత ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. శ్రీముఖ లింగేశ్వరంలో మూడుచేట్ల ముక్కోణపు ఆకా రంలో మూడు ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వర ఆలయం. దీని కి అభిముఖంగా కొంత దూరంలో భీమేశ్వర ఆలయం ఉంది. 

ఈ రెండు ఆలయాలకు కాస్త దూరంగా ఊరి ప్రథమార్ధంలో అధునాతన వాస్తు పద్దతిలో అద్భుత సోయగాలు కురిపి స్తూ సోమేశ్వర ఆలయం భక్తులకు ఆహ్వానం పలుకుతున్నటుగా ఉంటుంది. ఇందులో ప్రతిష్టితమైన లింగాన్ని శ్రీముఖలింగేశ్వరుడు అంటారు. ఈ ఆలయంపై సుమారు 100 సంవత్సరాల క్రిందట పిడుగు పడింది. పిడుగు పడినప్పుడు ఆలయ శిఖరం దెబ్బతిన గా దానిని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా వారు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ మూడు ఆలయాల్లోనూ శిల్ప కళాసంపద చూపరులకు కనువిందు చేస్తుంది. ఈ ఆల యం చాణుక్య శిల్పకళా వైభవానికి దర్పణం పడుతుంది. ఈ ఆలయాలు క్రీశ 573-1058 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెపుతుంటారు.

శ్రీముఖలింగేశ్వరుని చరిత్ర...
శ్రీముఖలింగేశ్వరుని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం ఒక కుమ్మరి కుటుంబానికి సంతానం కలుగకపోవడంతో ఆ దంపతులు చాలా బాధపడేవారు. సంతాన ప్రాప్తికి కోరుతూ ప్రతిరోజూ శ్రీముఖలింగేశ్వ రుని దర్శించుకుని తమ విన్నపాన్ని వినిపిం చేవారు. తమకు సంతానం కలిగితే దేవుడికి పెద్ద గోలెం (తొట్టె) చేయిస్తామని మొక్కుకు న్నారు. దేవుని కరుణాకటాక్షాల మూలంగా వా ళ్ళకి ఒక కుమారుడు జన్మించాడు. ఆ దంప తుల ఆనందానికి అవధులు లేకుండా పోయా యి. తమకు సంతాన భాగ్యాన్ని కలుగజేసిన పరమేశ్వరుడికి మొక్కు తీర్చు కోవాలని భావించారు. వెంటనే పెద్ద గోలెం చేయించి గుడికి తీసుకు వెళ్ళారు. అది పెద్దది కావడం తో గుడి ద్వారంలో నుంచి లోపలికి తీసుకు పోవడానికి ఆస్కారం లేకపోయింది. దీంతో ఆ దంపతులు ఎంతో వేదనకు గురయ్యారు. తమ మొక్కుబడిని పరమేశ్వరుడు కావాలని తిరస్కరించినట్టుగా భావించిన ఆ దంపతులు తల్లడిల్లిపోయారు.

vishveshwaraఎంతో కష్టపడి దేవునికి చేసిన గోలెం గర్భగు డిలోకి ప్రవేశించనపుడు ఆ పరమేశ్వరుడు ప్ర సాదించిన బిడ్డను తాము స్వీకరించజాలమని భీష్మించుకున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యతను ఆ పరమాత్ముడిపైనే వేసి ఆ దంపతులిద్దరూ గోలెంలో ఆ బిడ్డని ఉంచి దేవాలయ ప్రధాన ద్వారం దగ్గరే దిగా లుగా కూర్చున్నారు. పడమటి కొండల్లోకి సూర్యుడు చేరుకున్నా దంపతులు మాత్రం పట్టు వీడలేదు. రాత్రంతా ఆలయం ముందు అలాగే కూర్చున్నారు. అయితే శ్రీముఖలింగే శ్వరుని కరుణ వలన ఇరుకుగా ఉండే దేవా లయ ముఖద్వారం ఎవ రూ గమనించని ఆ రాత్రివేళ కొంచెం విప్పారి ఎవరి ప్రయత్నం లేకుండానే గోలెం గుడిలో ఉన్న శివలింగం వెనుకకు వెళ్ళి కుదురుకుంది. తెల్లవారి మెల కువ వచ్చిన తరువాత వారంద రూ ఈ వింత ను చూసి ఆశ్చర్యపోయారు. ఇ ప్పటికి ఆ గోలెం దేవాలయంలో ఉన్నది. దీనిలో ఎప్పుడూ బియ్యం వేసి ఉంటారు. ఎప్పుడూ అన్నానికి లోటు ఉండదనడానికి ఇది సంకేతం.

చారిత్రక కథనం...
చాణుక్య రాజుల అనంతరం ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశీయులు ఈ దేవాలయాన్ని కొన్ని సంవత్సరాలు సున్నంతో కప్పి ఉంచారు. వారి తదనంతరం వచ్చిన ఒరిస్సా గజపతి రాజులు ఆలయానికి పూర్వ వైభవం తెచ్చారు. వారు కొన్ని వందల ఎకరాల భూమిని అర్చన కోసం దానం చేసారు. ప్రతి సంవత్స రం శివరాత్రినాడు జరిగే లింగోద్భవ కార్యక్ర మానికి పర్లాకిమిడి గజపతి మహారాజు శ్రీ ముఖలింగం వచ్చి శ్రీముఖ లింగేశ్వరునికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, తలంబ్రాలు బియ్యం సమర్పించేవారు. ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుంతోంది.

భొనగిరి


The municipal area covers 9.63 km². As of 2001 India census,  Bhongir had a population of 57,451. Males constitute 51% of the population and females 49%. Bhongir has an average literacy rate of 70%, less than the national average of 74.04%; with male literacy of 78% and female literacy of 61%. 12% of the population is under 6 years of age.

  
Bhongir or Bhuvanagiri is a beautiful town and a municipality in Nalgonda district in the state of Andhra Pradesh, India. It is part of (Telangana region. Andhra Pradesh is divided into three regions Telangana, Rayalaseema, Andhra) and famous for its rich culture and heritage. Bhongir (also known as Bhongiri) is well connected by road and rail to all other important places in South India. It is 48 km from Hyderabad, capital of Andhra Pradesh. Bhongir Municipality Population - 50,263 as per 2001 census, an area covering 9.63 km². Bhongir is famous for its fort, which has had a significant history since the time of Kakatheeyas.
Bhongir Fort was built on an isolated monolithic rock by the western Chalukya ruler Tribhuvanamalla Vikramaditya VI and was thus named after him as Tribhuvanagiri. This name gradually became Bhuvanagiri and subsequently Bhongir(mainly because razakars could not pronounce the original name). At the foot of the fortified rocks 609.6 meters above the sea level stands the town of Bhongir, it has a unique egg-shaped construction with two entry points protected by huge rocks, so the fort was considered practically impregnable by invading armies. The splendid historical fort with the awe-inspiring rock and the aesthetically fortified courts which have stood the ravages of time stir the imagination of tourists. A moat that encircles the fort, a vast underground chamber, trap doors, an armoury, stables, ponds, wells etc., make for fascinating viewing. The view from the top of the surrounding countryside is simply breathtaking. The Bala Hisar or citadel on the top of the hill gives a bird's eye view of the neighbouring area. The fort is associated with the rule of the heroic queen Rudramadevi and her grandson Prataparudra. Rumour has it that there once was an underground corridor connecting Bhongir Fort to Golconda Fort.
People living in Bhuvanagiri also faced lot of hardship under nizam rule. The soldiers who used to terrorize the people were called razakars. People used to bury food and jewelry underground to save it from looting of razakars
Bhongir is located at [show location on an interactive map] 17.51° N 78.89° E.[1] It has an average elevation of 430 metres (1410 feet).
This beautiful Town is strategically located around the 'Bhongir Hill'. The Hill has a fort built in the period of the King Vikramaditya. The Hill is more than 500 feet high spread about 40 acres. The old steps from bottom of the Hill to the Top are still intact. One can have a great experience by climbing the hill and having a bird's view of the Town and surrounding Villages. The Hill also has a 'Hanuman Temple' on it. The Stone Hill also have few Ponds on top it. One such pond is shown in side photo. The Town is Famous for its Beatle Leaves, Pottery and textiles. A new website *   gives an updated information on the area.

తెలుగునాటి చరిత్ర


అంధ్ర ప్రదేశ్ లేక తెలుగునాటి చరిత్ర తొలుత చరిత్ర పూర్వయుగము మరియు చారిత్రకయుగము అను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఇందు చరిత్ర పూర్వయుగకథనానికి లిఖిత ఆధారాలు లభింపలేదు. ఇది క్రీస్తు పూర్వము మూడవ శతాబ్ది ఆరంభము వరకు కొనసాగిన ప్రాచీన కాలము. క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దినుండి ఆధునికకాలము వరకు నడచినది చారిత్రక యుగము. ఈ యుగమును మరల సౌకర్యార్ధమై పూర్వయుగము, మధ్యయుగము మరియు ఆధునికయుగము అని మూడు భాగములుగా విభజింపవచ్చును. మధ్య యుగాన్ని మళ్ళీ పూర్వ మధ్య యుగం (కాకతీయుల కాలం) మరియు ఉత్తర మధ్య యుగం (విజయ నగర రాజ్య కాలం)గా విభజిస్తారు.