పాపి కొండలు


పాపి కొండలు



పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లాపశ్చిమ గోదావరితూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. పాపి కొండల ప్రాంతంలో ఎక్కువ శాతం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉంది.
పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము దీనిని ఆంధ్రా కాశ్మీరం అని పిలవకుండ ఉండనీయవు. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది.
పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు, జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉన్నది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది.




పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మద్య ప్రవహిస్తూ ఆ వాతావరణంకు మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది. రాజమండ్రి నుండి ఇక్కడికి చేసే లాంచీ ప్రయాణం పర్యాటకులకు మర్చిపోలేని అనుభవం. పాపికొండల వెనుక భాగానికి కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవ్వబోతున్నది. సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు పాపికొండల పరిసరాల్లోనే తీశారు.

No comments:

Post a Comment