తలకోన చిత్తూరు జిల్లా యెర్రావారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. తిరుపతి కి 45 కి.మీ దూరంలో నల్లమల పర్వతశ్రేణుల మధ్యలో ఉన్నది. ఇక్కడ 60 మీటర్ల ఎత్తు నుండి పడుతున్న జలపాతాలు చాలా అకర్షణీయంగా ఉంటాయి. ఓషధీ లక్షణాలు కల మొక్కలు అనేకం ఉన్నాయి. ఇక్కడ చేరగానే మొదట మనం కనుగొనేది సిద్దేశ్వరాలయము మరియు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు. అలయానికి అతిసమీపముగా వాగు ఒకటి ఎల్లపుడూ ప్రవహిస్తూంటుంది. ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి.
తలకోనలో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి పున్నమి అతిథి గృహం ఉంది.
ఆలయము నుండి కొంత ముందుకు సాగిన నెలకోన, దిగువ ఝరి, ఎగువ ఝరి లకు వళ్ళవచ్చు. ఈ మూడింటికి చాల ప్రాముఖ్యత ఉంది. నెలకోన అన్నది దట్టమైన కొండల మద్య ఉంది. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఈ కొలను యొక్క లోతు ఎవరూ కనుగొనలేదు. అంత సాహసము ఎవరూ చేయలేదు. ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక అంశము రెండు కొండల నడుమ ఉండే పెద్ద గుండు రాయి. ఇది ఎప్పడు మీద పడుతందో అని భయపడక మానరు, చూసిన వారు. తలకోన శేషాచల కొండల వరుసలో తల బాగంలో వున్నందున దీన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు మూడు వందల అడుగులు. ఈ జలపాత దృశ్యం నయనానంద కరంగా వుంటుంది. ఆ జలపాతం పైనుండి కొంత దూరంలో పాపనాసం అనే తీర్థం వున్నది. ఇక్కడ గిల్లితీగ అనే తీగ వున్నది. ఈ తీగలు పొడవు కొన్ని కిలోమీటర్ల పొడువు వుంటాయి. దీని కాయలు కూడ చింత కాయల వలె వుండి వాటికన్న చాల పెద్దవిగా వుంటాయి. స్థానికులు ఈ తీలలోని అన్ని బాగాలను కాయలు, దాని గింజలను మందులుగా వాడుతారు. చర్మ వ్యాదులకు, జ్వరానికి, తలనెప్పికి ఇలా అనేక వ్వాదులకు వాడుతారు
. ఇవేకాక ఈ ప్రాంతంలో అనేక ఔషద మొక్కలున్నాయి. ఈ అటవీ ప్రాంతంలో అనేక రకాల వృక్షాలు అనగా మద్ది, చందనం ఎర్ర చందనం వంటి వృక్షాలు అధికంగా వున్నాయి. అడవి కోళ్లు, నెమళ్లు, , దేవాంగ పిల్లి, ఎలుగులు, ముచ్చు కోతులు వంటి జంతు జాలం వున్నది. వృక్షాలకు వాటి పేర్లు రాసిన పలకలు వాటికి తగిలించి వున్నారు. ఇక్కడి ప్రకృతి అందాలకు మురిసి అనేక సినిమాలు తీశారు. ఇక్కడికి కొంత మంది ఔత్సాహికులు ట్రెక్కింగు కొరకు కూడ వస్తుంటారు. ప్రకృతిని పక్షులను జంతువులను చూడడానికి అటవీ శాఖవారు ఇక్కడ ఎత్తైన వాచ్ టవర్లను నిర్మించారు. వాటి పైకెక్కి చూడ వచ్చు. శివరాత్రి పర్వ దినాన ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి.
తలకోన తిరుపతి సుమారు యాబై కిలో మీటర్ల దూరంలో వున్నది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులుంటాయి.
No comments:
Post a Comment