వైష్ణోదేవి ఆలయం
ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాష్మీరి రాష్ట్రంలో జమ్ము కు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో వున్నది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణి లో ఉన్నది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరం లో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్ల లో వెళ్లవచ్చు. ఇతర వాహనాలు వుంటాయి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైన వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో వున్నది. ఈ దారి చాల కష్టతరమైనది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లె ఇక్కడ కూద కొండ ఎక్కేవారు జై మాతాదీ అంటు అరుస్తుంటారు. ఇంకా చాల దూరం వుందనగానె మాతాదీ ఆలయం కనిపుస్తూనె వుంటుంది. ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయంలోపలికి సెల్ ఫోన్లు, కెమరాలు, అలాగె తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచు కోవచ్చు. వైష్ణో దేవి మూడు రూపాల్లొ దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడ వున్నాయి.
ఈ అమ్మ వారి ఆలయం ఉత్తర భారతాన జమ్ము జిల్లాలోని కాట్రా లో వున్నది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. పర్వ దినాలలో ఈ ఆలయానికి వచ్చె భక్తుల సంక్య లక్షలలో వుండగా కానుకలుగా ఆలయానికి నాలుగు కోట్ల రూపాయలు వస్తాయి.
No comments:
Post a Comment